హైదరాబాద్ లో బీజేవైఎం హంగామా: రాహుల్ గో బ్యాక్..: బ్యానర్ చీలికలు పేలికలు

హైదరాబాద్‌ మాదాపూర్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ వేదిక వద్ద బీజేపీ యువమోర్చా నాయకులు భారీ ఆందోళన చేపట్టారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరవుతున్న భారత్ సమ్మిట్ ను నిరసిస్తూ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. రాహుల్ గో బ్యాంక్ అంటూ నినదించారు.

హెచ్‌ఐసీసీ నోవోటెల్ ప్రాంగణంలో భారత్ సమ్మిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాహుల్ గాంధీని ఆహ్వానించింది. వేదిక ప్రాంగణంతో పాటు నగరంలో పలుచోట్ల రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వీటిని ఏర్పాటుచేశారు.

BJYM staged a protest at the Bharat Summit venue in Hyderabad raised slogans Rahul Gandhi go back

రాహుల్ గాంధీ రాకను వ్యతిరేకిస్తూ బీజేవైఎం నాయకులు అనూహ్యంగా హెచ్ఐసీసీ వేదిక వద్దకు చేరుకున్నాయి. అక్కడ కట్టిన పోస్టర్లు, భారీ ఫ్లెక్సీలను చింపివేశారు. రాహుల్ గాంధీ గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. సమ్మిట్ వేదిక వద్ద పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకున్నారు. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.

అనంతపురంలో రూ. 29 లక్షలు పలికిన సర్పంచ్ పదవి- బహిరంగ వేలం..!!
అనంతపురంలో రూ. 29 లక్షలు పలికిన సర్పంచ్ పదవి- బహిరంగ వేలం..!!

ఈ నిరసన ఘటన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారులు సమ్మిట్ వేదిక వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నోవోటెల్, హెచ్‌ఐసీసీ పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోనికి వెళ్లడానికి అనుమతించారు. ఆహ్వానితుల పాస్ లను పరిశీలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బీజేవైఎం చర్యలతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఈ ఆందోళన పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు తరలివస్తోన్నారని, అలాంటి భారత్ సమ్మిట్ ను అడ్డుకోవడం బీజేవైఎం దివాళాకోరుతనానికి నిదర్శమని మండిపడుతోంది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన నిరసనకారులపై కేసులు నమోదు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+