అనంతపురంలో రూ. 29 లక్షలు పలికిన సర్పంచ్ పదవి- బహిరంగ వేలం..!!

ఏపీ స్థానిక సంస్థల రాజకీయం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పరిధిలోని గార్లదిన్నె మండలం కొప్పలకొండ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయడానికి లక్షల రూపాయలతో బహిరంగ వేలం పాట నిర్వహించడం చర్చనీయాంశమైంది. రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ధనప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.

కొప్పలకొండ రామాలయం ప్రాంగణంలో గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్ పదవికి బహిరంగంగా వేలం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వేలంలో స్థానిక టీడీపీ నాయకుడు ఎల్‌ఐసీ ఆదినారాయణ 29 లక్షల రూపాయల భారీ మొత్తానికి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నట్లు సమాచారం. గ్రామాభివృద్ధి, స్థానిక ఆలయ నిర్మాణ నిధుల కోసం లక్షలాది రూపాయలను ఇలా వేలంలో నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Open Auction for Sarpanch Election in Singanamala Koppalakonda of Anantapur Sparks Debate Spotlight

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ఖర్చులను తగ్గించుకోవడానికి, గ్రామంలో వర్గపోరు లేకుండా ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకుంటుంటారు. ఈ విధానం పూర్తిగా దారి తప్పిందనే ఆందోళన వ్యక్తమౌతోంది. అత్యధిక ధర పలికిన ధనవంతులకు పదవులను కట్టబెట్టే వ్యాపార సంస్కృతిగా మారుతోందనే వాదనలు వినిపిస్తోన్నాయి. ఏకగ్రీవం పేరుతో పెద్ద ఎత్తున నిధులు గుమ్మరించడం, గ్రామ పెద్దల సమక్షంలో ప్రజాస్వామ్య పదవులను వేలం వేయడం ఓటు హక్కుకు భంగం కలిగినట్టే అవుతుందని చెబుతున్నారు.

టీమిండియా నుంచి స్టార్ స్పిన్నర్ అవుట్: బ్రార్ భయ్యాకు చోటు
టీమిండియా నుంచి స్టార్ స్పిన్నర్ అవుట్: బ్రార్ భయ్యాకు చోటు

అలాగే.. వేలం పాటల ద్వారా పదవులు పొందిన వ్యక్తులు ప్రజాసేవ చేయడం కంటే తాము పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల పదవులను వేలం వేయడం, డబ్బులు, ఇతర ప్రయోజనాలు ఆశచూపి అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడం నేరం. గతంలో కూడా పలు జిల్లాల్లో ఇటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రక్రియను రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి.

ధనబలంతో పంచాయతీ పదవులను కొనుగోలు చేసే పద్ధతి వల్ల నిజమైన అర్హత, సేవా నిబద్ధత ఉన్న సామాన్య పౌరులు స్థానిక పాలనకు దూరం అయ్యే ప్రమాదం లేకపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో స్వేచ్ఛగా, పారదర్శకమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడటంలో స్థానిక పరిపాలనా యంత్రాంగం మరింత క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంది. రాజ్యాంగబద్ధంగా జరిగే స్థానిక ఎన్నికల్లో ధనప్రభావాన్ని అడ్డుకోకపోతే పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రాథమిక లక్ష్యమే తీవ్రంగా దెబ్బతింటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+