వారికి ప్రత్యేక ఎస్కార్ట్ కల్పిస్తాం- ఎస్ఈసీ కీలక ప్రకటన..!!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా కీలక ప్రకటన చేసారు. రెండో విడత మున్సిపల్... పంచాయితీ ఎన్నికల నిర్వహణ పైన సమీక్ష చేసారు. పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఘటనల వేళ ఈ సారి కీలక నిర్ణయం ప్రకటించారు. ఇక నుంచి నామినేషన్ల సమర్పణకు ఎవరైనా ప్రత్యేక ఎస్కార్ట్‌ కావాలంటే కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాడి ముప్పు ఉందని ఎస్పీకి చెప్తే, అభ్యర్థులకు ప్రత్యేక భద్రత కల్పిస్తారని స్పష్టం చేసారు.

పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పైన ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్నాడు నుంచి రాయలసీమ వరకు కొన్ని గొడవలు జరిగాయని పునేఠా చెప్పుకొచ్చారు. సమస్యాత్మక 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేకంగా మాట్లాడామని... పంచాయతీ ఎన్నికల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. నామినేషన్ల సమర్పణకు ఎవరైనా ప్రత్యేక ఎస్కార్ట్ కావాలంటే కల్పిస్తామని... దాడి ముప్పు ఉందని ఎస్పీకి చెప్తే.. అభ్యర్థులకు ప్రత్యేక భద్రత కల్పిస్తారని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగుతాయని వివరించారు. శాంతిభద్రతలు బాగుంటేనే, ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా సాగుతుందని అభిప్రాయ పడ్డారు. పంచాయతీ ఎన్నికల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించామని వెల్లడించారు.

TTD గోల్డెన్ ఛాన్స్:రూ.5 చెల్లిస్తే 'సద్గమయ'లో నమోదు, ఫ్యామిలీతో శ్రీవారి దర్శనం..!!
TTD గోల్డెన్ ఛాన్స్:రూ.5 చెల్లిస్తే 'సద్గమయ'లో నమోదు, ఫ్యామిలీతో శ్రీవారి దర్శనం..!!
sec-puneetha-assures-special-escort-for-candidates-filing-nominations-during-panchayt-elections

శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తాం

అదే విధంగా పంచాయతీరాజ్ శాఖలో తాజాగా జారీ అయిన జీవో మేరకు ఏకగ్రీవం అయిన గ్రామాలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు ఇస్తుందని పునేఠా వివరించారు. ఐదు వేల వరకు జనాభా ఉన్న గ్రామానికి రూ.15 లక్షల ప్రోత్సాహక నిధులు వస్తాయని... ఐదు వేల నుంచి పది వేల వరకు జనాభా ఉన్న గ్రామాలకు రూ.25 లక్షల నిధులు అందుతాయని చెప్పారు. 15 నుంచి 20 శాతం గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందని వివరించారు. ఈనెల 20 జడ్పీ ఛైర్‌పర్సన్లకు..19న ఎంపీపీల ఎన్నిక ఉంటుందని వెల్లడించారు. జడ్పీ ఛైర్‌ పర్సన్స్‌, ఎంపీపీల ఎన్నిక విధివిధానాలు ప్రకటించామని గుర్తు చేసారు. పదవీ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే వారి పదవీకాలం ఐదేళ్లు ఉంటుందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+