ఎట్టకేలకు గాడిన పడిన మైక్రోసాఫ్ట్ సేవలు! ఊపిరి పీల్చుకున్న 70 దేశాల యూజర్లు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు, వ్యాపార సంస్థలను 36 గంటలకు పైగా ముప్పుతిప్పలు పెట్టిన మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. గురువారం (నవంబర్ 12) మొదలైన ఈ అంతరాయానికి శనివారం తెల్లవారుజామున తెరపడినట్లు సంస్థ ప్రకటించింది. దీనితో అవుట్‌లుక్, టీమ్స్, కోపైలట్ సహా మైక్రోసాఫ్ట్ 365 సేవలన్నీ తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. 70కి పైగా దేశాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విమానయాన సంస్థలు, కార్పొరేట్ కార్యకలాపాలను స్తంభింపజేసిన ఈ సమస్య తొలగిపోవడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.

సైబర్ దాడి కాదు.. నెట్‌వర్క్ మార్పులే అసలు కారణం!

గురువారం ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్ మెయిల్ బాక్సుల ఓపెనింగ్‌లో మొదలైన ఈ సమస్య, క్రమంగా అవుట్‌లుక్, షేర్ పాయింట్, ప్లానర్, టు-డూ వంటి కీలక ఆఫీస్ యాప్స్‌కు పాకింది. టీమ్స్‌లో మెసేజింగ్, మీటింగ్స్ కొనసాగినా.. క్యాలెండర్, షెడ్యూలింగ్ ఫీచర్లు మొరాయించాయి. కోపైలట్ యూజర్లు సైతం చాట్ లోడ్ కాక ఇబ్బంది పడ్డారు. అయితే దీని వెనుక ఎలాంటి సైబర్ దాడి గానీ, ఏఐ ఏజెంట్ల ప్రమేయం గానీ లేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. గతంలో చేసిన నెట్‌వర్క్ సామర్థ్య పెంపుదల పనులకు, ఇటీవల చేసిన మరో మార్పు తోడవడంతోనే ఈ సాంకేతిక లోపం తలెత్తినట్లు తేల్చింది.

Microsoft Resolves Major Global Outage After 36 Hours Restoring Outlook Teams and Copilot Across 70 Nations
కోట్లాది మందికి ఇబ్బందులు.. క్షమాపణలు చెప్పిన మైక్రోసాఫ్ట్!
కోట్లాది మందికి ఇబ్బందులు.. క్షమాపణలు చెప్పిన మైక్రోసాఫ్ట్!

విమానయాన సంస్థల నుంచి ఏఐ దిగ్గజాల వరకు ఎఫెక్ట్!

ఈ అంతరాయం ప్రభావం కేవలం ఇన్‌బాక్స్‌లకే పరిమితం కాకుండా అనేక రంగాలను కుదిపేసింది. భారత్‌లో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తమ ఈమెయిల్ సపోర్ట్ సేవలకు అంతరాయం కలిగిందని, అత్యవసర సాయం కోసం వెబ్‌సైట్ లేదా యాప్ వాడాలని ప్రయాణికులకు సూచించింది. మరోవైపు ఎయిర్ ఇండియా తమ విమాన సర్వీసులకు ఎలాంటి ఆటంకం కలగలేదని, ప్రయాణికుల సమాచారం కోసం ఈమెయిల్ ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించామని తెలిపింది. అంతేకాకుండా ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి దిగ్గజ ఏఐ సంస్థల మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్లపైనా దీని ప్రభావం పడింది.

ఎక్కడికక్కడ స్తంభించిన మైక్రోసాఫ్ట్- గ్లోబల్ అవుటేజ్
ఎక్కడికక్కడ స్తంభించిన మైక్రోసాఫ్ట్- గ్లోబల్ అవుటేజ్

క్షమాపణ చెప్పిన సంస్థ.. క్లౌడ్ ఆధారిత వ్యవస్థలపై కొత్త చర్చ

కలిగిన అసౌకర్యానికి మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు క్షమాపణలు తెలిపింది. ఒక్కసారిగా కాకుండా, ప్రతి దశలో స్థిరత్వాన్ని పరీక్షిస్తూ సేవలను పునరుద్ధరించామని, పెండింగ్‌లో ఉన్న మెయిల్స్ పోకుండా ఉండేందుకు ఈమెయిల్ టైమ్అవుట్ గడువును 48 గంటలకు పెంచామని వివరించింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి నివేదిక విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు, కొన్ని క్లౌడ్ సర్వీసులపైనే ప్రపంచం అతిగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసిందని, అత్యవసర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం అవసరమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+