టాలీవుడ్ లో విషాదం- నటుడు గిరిబాబు కన్నుమూత..!!
సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో గిరిబాబు జన్మించారు. దాదాపు 600 సినిమాల్లో గిరిబాబు నటించారు. నాలుగు దశాబ్దాలక పైగా సినీ రంగంలో రాణించిన గిరిబాబు కొంత కాలంగా అస్వస్థతో ఉన్నారు. ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. గిరిబాబు మరణంలో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.
తెలుగు సినీ పరిశ్రమ లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు గిరిబాబు కన్ను మూసారు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలతో గిరిబాబు జన్మించారు. ఆయనకు రవిబాబు, బోసు బాబు ఇద్దరు కుమారులు. రవిబాబు సినీ రంగంలో కొనసాగుతున్నారు. ఆయన భార్య శ్రీదేవి 2016 లో మరణించారు.

నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా మరియు నిర్మాతగా వందలాది సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 1973 లో జగమే మాయ తొలి సినిమా. అక్కడ నుంచి అనేక పాత్రల్లో.. ప్రముఖ సినిమాల్లో నటించారు. 2023 లో వచ్చిన అన్నీ మంచి శకునములే గిరిబాబు చివరి నినిమా. గిరిబాబు మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
