ఛత్తీస్గఢ్ టూర్ వెళ్లొద్దామా..? బడ్జెట్ ధరలోనే.. ఐదు రోజులు దండకారణ్యంలో..
ఛత్తీస్గఢ్ లో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. దట్టమైన అడవులు.. ఎత్తైన కొండలు.. జలపాతాలు.. చారిత్రక కట్టడాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఛత్తీస్ గఢ్ లో చాలానే టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ పర్యటనకు వెళ్లాలనుకునేవారికి ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. 'డిస్కవర్ దండకారణ్య' పేరుతో ఐదు రోజుల ఫ్లైట్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఛత్తీస్గఢ్ లోని చారిత్రక ఆలయాలు, సాంస్కృతిక ప్రదేశాలు, ప్రకృతి అందాలను ఒకే ట్రిప్ లో చుట్టేసి రావచ్చు. ఐదు రోజులు, నాలుగు రాత్రుల పాటు సాగే ఈ టూర్ 2026 డిసెంబర్ 2న హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్యాకేజీ ధరలు, ప్రయాణ తేదీలు, పూర్తి వివరాలు చూస్తే..
ఈ ప్రత్యేకమైన టూర్ లో భాగంగా ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్, సిర్పూర్, జగదల్ పూర్, బస్తర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. వీటితో పాటు ప్రసిద్ధ చిత్రకూట్ జలపాతాలను కూడా చూసే అవకాశం ఉంటుంది. వేసవి ఎండలు, వర్షాకాలంలోని ఇబ్బందులు లేకుండా పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్ లో ముఖ్యంగా అడవులు, కొండలు, జలపాతాల పరిసరాల్లో ప్రకృతి అందాలను ప్రశాంతంగా ఆస్వాదించే అవకాశం ఉంది. ఇక ఈ టూర్ లో భాగంగా డిసెంబర్ 2న హైదరాబాద్ నుంచి రాయ్పూర్ కు ఇండిగో విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది. పర్యాటకులు రాయ్ పూర్ కు చేరుకున్నాక ముక్తాంగన్ కల్చరల్ గార్డెన్, కౌసల్య మాత ఆలయం, రామ్ మందిర్, వివేకానంద సరోవర్ లను సందర్శిస్తారు. రాత్రికి రాయ్పూర్లోనే బస చేస్తారు.
ఇక రెండోరోజు రాయ్ పూర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్పూర్ లో లక్ష్మణ ఆలయం, ఇతర చారిత్రక కట్టడాలను సందర్శిస్తారు. అక్కడినుంచి చంపారన్ కు వెళ్లి వల్లభాచార్య ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రికి తిరిగి రాయ్ పూర్ కు చేరుకుని అక్కడే బస చేస్తారు. మూడో రోజు జగదల్ పూర్ లో పర్యటన ఉంటుంది. జగదల్ పూర్ లో చిత్ర కూట్ జలపాతం సందర్శన ఉంటుంది. ఇంద్రావతి నదిపై ఈ జలపాతం ఉంది. ఈ జలపాతం సందర్శన తర్వాత తిరిగి జగదల్ పూర్ కు చేరుకుంటారు. ఇక చివరిరోజు బస్తర్ ప్యాలెస్, దంతేశ్వరి మందిరాన్ని సందర్శిస్తారు. ఈ సందర్శన అనంతరం జగదల్ పూర్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయలుదేరడంతో పర్యటన ముగుస్తుంది. ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్ట్ క్లాస్ లో ఒక్కొక్కరికి సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.44 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ప్యాకేజీ వివరాల విషయానికి వస్తే.. కంఫర్ట్ క్లాస్లో ఒక్కొక్కరికి సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.44వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.35,850 గా ఉంది. ఈ ట్రిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను www.irctctourism.com వెబ్ సైట్ లో చూడొచ్చు.












Click it and Unblock the Notifications
