అన్న స్టోరీ సెలక్షన్ సూపర్.. వరుసగా రెండో హిట్టు..!
టాలీవుడ్ యంగ్ హీరో మౌళి 90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ మూవీతో తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే మౌళి సినిమాలపై ఆసక్తి, అంచనాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే ఆయన తాజాగా 'దొంగ నా కొడుకు' అనే వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ మూవీ నవంబర్ 13 శుక్రవారం రోజున విడుదలైంది. ఈ మూవీలో మౌళి సరసన సుష్మిత శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే అలీ, రజిత, రఘుబాబు, భద్రం, గుండు సుదర్శన్, ప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు.
ఇక దొంగ నా కొడుకు మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గానే కలెక్షన్స్ రాబడుతోంది. కథ పాయింట్ చాలా రొటీన్ గానే ఉన్నా మౌళి స్టైల్ కామెడీతో సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మాత్రం సాలిడ్ గానే ట్రెండ్ ను చూపించింది. పోటీలో ఇతర సినిమాలు ఉన్నా మౌళి ఫస్ట్ మూవీ లిటిల్ హార్ట్స్ కన్నా కూడా డీసెంట్ గానే వసూల్లు వచ్చాయి.

లిటిల్ హార్ట్స్ మూవీ ఫస్ట్ డే 1.5 కోట్ల గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకుంటే దొంగ నా కొడుకు సినిమా ఏకంగా 1.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవడం విశేషం. అటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు డీసెంట్ గానే వసూల్లు వస్తున్నాయి. ఓవర్సీస్ లో 1.5 కోట్లకు పైగానే వసూళ్లని సొంతం చేసుకుంది. మొత్తంగా లిటిల్ హార్ట్స్ మూవీ ఫస్ట్ డే రూ. 2.65 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకోగా.. తాజాగా దొంగ నా కొడుకు మూవీ రూ. 3.6 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ను రాబట్టింది. అలాగే రానున్న రోజుల్లో వీకెండ్ కావడంతో ఈ మూవీకి డీసెంట్ గానే వసూల్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
