అమరావతి రైల్వే కనెక్టివిటీలో కీలక అప్డేట్.. రూట్, ప్రధాన స్టేషన్, మెగా టెర్మినల్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రత్యక్ష రైల్వే కనెక్టివిటీ కల్పించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ఎర్రుపాలెం-నంబూరు మధ్య నిర్మించనున్న కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్‌కు సంబంధించి రూట్, ప్రధాన రైల్వే స్టేషన్ స్థానం, భారీ కోచ్ టెర్మినల్ ప్రాంతం దాదాపు ఖరారయ్యాయి. గతంలో రూపొందించిన ప్రణాళికల్లో కొన్ని మార్పులు చేస్తూ తాజా రూపురేఖలను రైల్వే శాఖ సిద్ధం చేసింది.

రాజధాని ప్రాంతానికి పటిష్ఠమైన రోడ్డు, రైలు రవాణా వ్యవస్థను అనుసంధానించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నారు.ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా నంబూరు వరకు నిర్మించనున్న ఈ కొత్త రైల్వే కారిడార్ పొడవును గతంలో ప్రతిపాదించిన 56.53 కిలోమీటర్ల నుంచి 58.1 కిలోమీటర్లకు సవరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల కారణంగా ఈ స్వల్ప పెరుగుదల జరిగింది.

Amaravati Railway line Connectivity Project Advances Route Main Station and Mega Terminal Finalised

ఈ మార్గంలో గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచే విధంగా అత్యంత ఆధునిక సాంకేతికతతో ట్రాక్‌ను నిర్మించనున్నారు. లూప్ లైన్లు, బైపాస్ లైన్లు కలిపి మొత్తం ట్రాక్ పొడవు సుమారు 74 కిలోమీటర్లు ఉంటుంది.ఈ కారిడార్‌లో కృష్ణా నదిపై సుమారు 4.5 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్ వంతెన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనితో పాటు మొత్తం 32 భారీ వంతెనలు, 92 చిన్న వంతెనలు, రాకపోకలకు అంతరాయం లేకుండా 12 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు.

ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.2,047 కోట్లు. దీన్ని నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ పనులు చేపడుతున్నారు. వీటిలో వడ్డమాను-నంబూరు మధ్య 28.35 కిలోమీటర్ల ప్యాకేజీకి ఇటీవల టెండర్లు పిలిచారు. ప్రధాన అమరావతి రైల్వే స్టేషన్‌ను తాడికొండ సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో నెక్కల్లు-పెదపరిమి ప్రాంతంలో ప్రతిపాదించిన స్థానానికి బదులు ఇన్నర్ రింగ్ రోడ్డు కారణంగా ఈ మార్పు చేశారు.

కొప్పురావూరు సమీపంలో మెగా కోచ్ టెర్మినల్ ఏర్పాటుకు రైల్వే శాఖ 230 ఎకరాల భూమి కేటాయించాలని అభ్యర్థించింది. ఇక్కడ 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 పిట్ లైన్లు, 12 స్టేబులింగ్ లైన్లతో రైళ్ల నిర్వహణ సౌకర్యాలు ఉంటాయి.ఈ మార్గంలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు వద్ద నాలుగు క్రాసింగ్ స్టేషన్లు, మరో ఐదు హాల్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎర్రుపాలెం, నంబూరు స్టేషన్లు భవిష్యత్తులో జంక్షన్‌లుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఈ లైన్ విజయవాడ జంక్షన్‌పై పడుతున్న భారాన్ని తగ్గించి, రాజధాని ప్రాంతం నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా వంటి నగరాలకు సులభంగా చేరుకునే అవకాశం కల్పిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రగతి సమావేశంలో ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. భూసేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ పనులు కొనసాగుతున్నాయి.

శ్రీశైలం ఘాట్‌ రోడ్డుపై ఎలివేటెడ్‌ కారిడార్‌కు NHAI సర్వే.. తగ్గనున్న దూరం!
శ్రీశైలం ఘాట్‌ రోడ్డుపై ఎలివేటెడ్‌ కారిడార్‌కు NHAI సర్వే.. తగ్గనున్న దూరం!

సీఆర్‌డీఏ సహకారంతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రాజెక్టు 2028 చివరి లేదా 2029 ఆరంభం నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ రైల్వే లైన్ పూర్తయితే రాజధాని ప్రాంతంలోని లక్షలాది ప్రజలకు, పరిశ్రమలకు, వ్యాపారాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయి. అమరావతిని జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో నేరుగా కలుపుతూ, రాష్ట్ర రాజధానికి కొత్త గుర్తింపు తెచ్చే ఈ ప్రాజెక్టు అమలు వైపు ఇప్పుడు మరింత వేగంగా అడుగులు పడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+