గిరిబాబు ఆస్తుల విలువ ఎంతంటే.? ఆ ఒక్క సినిమాతో 25 ఏళ్లు సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేసి..
టాలీవుడ్ సీనియర్ గిరిబాబు (80) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించిన ఆయన గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన గిరిబాబు చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఇక గిరిబాబు 1946లో ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు యర్రా శేషగిరిరావు. అయితే సినిమాల్లోకి వచ్చాక గిరిబాబుగా ప్రసిద్ధి చెందారు. చిన్ననాటి నుంచే నాటకాలపై ఆసక్తిని పెంచుకున్నారాయన.
అలా గిరిబాబుకు 1973 లో జగమే మాయ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో గిరిబాబు నటన బాగుండటంతో ఆయనకు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. తన సుదీర్ఘమైన సినీ కెరీర్ లో దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు. కురుక్షేత్రం, మెరుపు దాడి, సింహగర్జన, ఇడియట్, అతడు, కితకితలు, రేసుగుర్రం తదితర చిత్రాలతో ప్రేక్షకుల గుర్తింపు పొందారు. అయితే నటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ రాణించారు. గిరిబాబు నిర్మాతగా మారిపోయి దేవతలారా దీవించండి, మెరుపుదాడి, ఇంద్రజిత్ లాంటి సినిమాలు తీశారు. అలాగే దర్శకుడిగా రణరంగం, నీ సుఖమే నే కోరుతున్నా లాంటి సినిమాలను తెరకెక్కించారు.
ఇక గిరిబాబు ఆస్తుల విషయానికి వస్తే.. దాదాపు 600 లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన భారీ స్థాయిలోనే ఆస్తులను కూడా పెట్టారని సమాచారం. గిరిబాబు స్వస్థలం ప్రకాశం జిల్లాలో భారీగా భూములు కొనుగోలు చేశారని టాక్. అలా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ సుమారు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించారని సమాచారం అందుతోంది. ఇక గిరిబాబుకు ముగ్గురు సంతానం. ఆయన పెద్ద కుమారుడు రఘుబాబు ప్రస్తుతం తెలుగులో ప్రముఖ కమెడియన్ గా ఉన్నారు. రెండో కుమారుడు బోస్ బాబు పలు చిత్రాల్లో నటించినా ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

అయితే గిరిబాబు.. తన కుమారుడు బోస్ బాబు హీరోగా ఇంద్రజీత్ అనే సినిమా తీశారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం, నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ఈ మూవీ భారీ డిజాస్టర్ అయింది. ఇంద్రజీత్ మూవీ కోసం దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన పెద్ద కుమారుడు రఘబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమా డిజాస్టర్ కావడంతో రూ. 33 లక్షలు నష్టాలు వచ్చాయని.. ఆ అప్పుల నుంచి బయటపడేందుకు గిరిబాబు 25 ఏళ్ల పాటు మద్రాస్ లో సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేశారని పేర్కొన్నారు. ఎవరికీ ఒక్క రూపాయి బాకీ ఉండకూడదని వడ్డీతో సహా అప్పులన్నీ తీర్చారని రఘుబాబు వివరించారు.












Click it and Unblock the Notifications
