ఏపీలో దారుణం.. కత్తులతో పొడిచి కిరాతకంగా యువకుడిని హత్య !!
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగర శివారులో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేఘాద్రి గెడ్డ సమీపంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుడిని గుంటూరు జిల్లా వాసి కల్యాణ్ చక్రవర్తి (25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆదివారం రాత్రి మేఘాద్రి గెడ్డ ప్రాంతంలో కొందరు యువకులు మద్యం సేవిస్తూ గుమిగూడినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అది ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఆ ఘర్షణలో ఒక యువకుడిపై దాడి జరగడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలే హత్యకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అనుమానితులు మనోజ్, వినోద్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, ఘటనలో మరెవరైనా పాత్రధారులు ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. మద్యం సేవించడం వల్లే గొడవ తీవ్రరూపం దాల్చినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం హత్యకు గల అసలు కారణాలు, నిందితుల వివరాలను వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో మేఘాద్రి గెడ్డ పరిసర ప్రాంతాల్లో భయభ్రాంతులు నెలకొనగా, స్థానికులు పోలీసుల గస్తీ పెంచాలని కోరుతున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications