బాబు, కేసీఆర్ వివాదం: పవన్ కళ్యాణ్‌కు అభిమాని లేఖ

హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఓ అభిమాని లేఖ రాశారు. ఓటుకు నోటు వ్యవహారం, చంద్రబాబుదిగా చెబుతున్న ఆడియో టేప్... వంటి అంశాలు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేసిన విషయం తెలిసిందే.

తాజా హాట్ హాట్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో సదరు పవన్ కళ్యాణ్ అభిమాని అతను మౌనం దాల్చవద్దని లేఖ రాశారు.

ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు,

నేను నీకు డైహార్డ్ ఫ్యాన్‌ని. నేను మీకు ఫ్లెక్సీలు కట్టకపోవచ్చు, థియేటర్ల వద్ద కటౌట్లు పెట్టకపోవచ్చు, కనీసం మీ పోస్టర్లకు పూమాలలు కూడా వేయలేకపోవచ్చు.. కానీ నేను మీకు మంచి అభిమానిని. అవి చేయనంత మాత్రాన మీ అభిమానిని కాకుండా పోను.

MUST READ: A Fan's Open Letter To Pawan Kalyan

మీ సినిమాలతో, సినీ పరిశ్రమకు మీ సహకారంతో పాటు మీ సామాజికసేవ, దాతృత్వసేవలు, రాజకీయ, సామాజిక అంశాల పైన మీ ఆలోచనలు మీ పైన అభిమానాన్ని రెట్టింపు చేశాయి. కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ లేదా యువరాజ్యానికి మీరు చాలా చేశారు. సిన్సియర్‌గా చేశారు.

మీరు హైటెక్స్ గ్రౌండ్‌లో జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి దేశ రాజకీయాల్లో మీ పాత్ర గురించి నిరీక్షిస్తున్నాం. 'ఇజమ్' పుస్తకం మీ పైన అంచనాలను మరింత పెంచింది. భారత జాతికి మీరు ఏం చేయదల్చుకున్నారో అది చెప్పింది.

మీరు 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. అందుకు మిమ్మల్ని ప్రశంసించాల్సిందే. అయితే, ప్రస్తుత సమయంలో రాజకీయాల్లో మీ పాత్ర గురించి ఎదురు చూస్తున్నాం.

రాష్ట్ర విభజన అనంతరం, తెలుగు మాట్లాడే రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ముఖ్యమంత్రుల ఘర్షణ న్యూ జనరేషన్ రాజకీయాలకు ముప్పు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటివి పెద్ద సెట్ బ్యాక్. ప్రస్తుతం ప్రజలు మార్పు కోసం చూస్తున్నారు. పవన్ గారు మీరు రాజకీయాలను మార్చగలరు. ఇప్పుడే వస్తే, అసలు రాకపోవడం కంటే ఆలస్యమైనా మిన్న.

ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడటంలో ఫెయిలైంది. జనసేన దానిని ఫుల్ ఫిల్ చేస్తుందని భావిస్తున్నాం.

మీరు లోక్ సత్తా వంటి పార్టీలతో కలవచ్చు. తద్వారా మేజర్ రాజకీయ పార్టీగా త్వరలో ఎదగవచ్చు. రాజకీయాల్లో మీ పాత్ర గురించి నా లాంటి చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో మీ పెద్ద పాత్ర కోసం చూస్తున్నాం.

గబ్బర్ సింగ్ సినిమా నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తా అన్నట్లుగా రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తారని చూస్తున్నాం. జనసేనను బలోపేతం చేసేందుకు ఇదే మంచి సమయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+