నెలకు రూ.10వేలతో కోటీశ్వరులు కావచ్చు!
విజేతలు విభిన్నంగా ఉండే పనులు చేయరు.. వారి పనులే విభిన్నంగా ఉంటాయి అని చెప్పారు ప్రముఖ రచయిత శివ్ ఖేరా. యూకెన్ విన్ పుస్తకంలో ఈ ప్రస్తావన ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ కోట్ చక్కగా సరిపోతుంది. సింపుల్ పెట్టుబడి స్ట్రాటజీతో కోటీశ్వరులు కావొచ్చు. నెలకు రూ.10వేల చొప్పున పొదుపు చేసుకుంటూ వెళితే 15 సంవత్సరాల్లో కోటిరూపాయలను సులువుగా వెనకేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ప్రకారం నెలకు రూ.10వేలు చెల్లిస్తే ఎంత లాభవం వస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్లలో 15x15x15 రూల్ గురించి చెబుతారు. కోటి రూపాయలు కూడబెట్టడానికి 15 సంవత్సరాలపాటు నెలకు రూ.15వేల చొప్పున పొదుపు చేస్తుండాలి. వార్షిక ప్రాతిపదికన 15 శాతం రిటర్న్స్ వస్తుండాలి. ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ వేరుగా ఉండాలంటున్నారు నిపుణులు. రూ. 10 వేల పెట్టుబడిని ప్రతి ఏటా కొంత మొత్తం పెంచుకుంటూ పోతే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌తో మంచి రిటర్న్స్ వస్తాయని, ఇక్కడ కూడా రూ. కోటి అవుతుందని విశ్లేషించారు.

ఒక పెట్టుబడిదారు నెలకు రూ. 10 వేల చొప్పున 15 సంవత్సరాలపాటు పెట్టుబడులు పెడుతూ ఏటా 10 శాతం చొప్పున ఇన్వెస్ట్‌మెంట్ ను పెంచుకుంటూ పోతే రూ. 1.03 కోట్ల రాబడి అవుతుంది. ఇక్కడ మీరు పెట్టిన పెట్టుబడి రూ. 38,12,698 కాగా.. రిటర్న్స్ రూ. 64,99,143 గా ఉంటాయని అంచనా. మొత్తంగా విలువ రూ. కోటి దాటుతుంది. స్టాక్ మార్కెట్లతో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కాస్త రిస్క్ తక్కువ. షేర్ మార్కెట్లలో నేరుగా రిస్క్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ల నుంచి స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం సేఫ్. ఒక ప్లాన్ తో ముందుకు వెళితే రాబడి బాగుంటుంది.












Click it and Unblock the Notifications