కేసీఆర్ పులి, ఎర్రబెల్లి యువకుడు: రేవంత్, జూ ఘటన..
హైదరాబాద్: ఇటీవల ఢిల్లీలోని జూలో ఓ యువకుడిని తెల్లపులి పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఉదహరిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావుల పైన విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ జూలో ఓ యువకుడు పెద్దపులి ఎన్‌క్లోజర్‌లో పడితే అది చంపేసినట్లుగా వచ్చిన వార్తను ప్రస్తావిస్తూ.. అందులోని యువకుడు తమ నేత ఎర్రబెల్లి దయాకర రావు కాగా, తెల్లపులి కేసీఆర్ అన్నారు. దానిని రాళ్లు వేసి రెచ్చగొట్టేది మైహోం రామేశ్వర రావు అని ఎద్దేవా చేశారు. మైహోం ఓవర్ ముఖ్యమంత్రి మద్దతుదారు అన్నారు.

గతంలో ప్రాంతీయవాదంతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మభ్యపెట్టారని, ఇప్పుడు కులవాదంతో ఎర్రబెల్లిని మభ్యపెడుతున్నారన్నారు. దోపిడీదారులనే దొరలు అని అంటున్నాను తప్ప సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కాదన్నారు.
కాగా, గత కొద్ది రోజులుగా తెలంగాణ టీడీపీలో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల మధ్య మెట్రో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎర్రబెల్లి ఇటీవల కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, తాను టీడీపీని వీడనని ఎర్రబెల్లి చెప్పారు. ఇలాంటి సమయంలో రేవంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications