పొత్తులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు - చెప్పానంటే చేస్తానంతే..!!

ఏపీలో రాజకీయ పొత్తులపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు పొత్తుల్లేవని..తాను పొత్తుల కోసం వెంపర్లాడనని సీఎం తేల్చి చెప్పారు. తనకు పొత్తులు అంటే ఉంటేది ప్రజలతోనే అని స్పష్టం చేసారు. చిలకలూరిపేటలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రతిపక్షాల పైన ఫైర్ అయ్యారు. జిత్తులు..పొత్తులు..కుయుక్తులతో పొత్తులు పెట్టుకొని తోడేళ్లు అన్నీ ఒక్కటిగా తన మీద పోరాటనికి సిద్దం అవుతున్నాయని చెప్పారు. తనకు అంగ బలం..అర్దం బలం లేవన్నారు. తనకు ఉన్నది దేవుడి దయ...ప్రజల మద్దతు అని జగన్ స్పష్టం చేసారు.

చేసేదే చెబుతాను..చెప్పందే చేస్తాను: స్కాములు తప్ప స్కీములు తెలియని బాబులకు అధికారంలో ఉండగా దోచుకో పంచుకో తినుకో మాత్రమే అమలు చేసారని ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు. వయసు పెరిగినా బుద్ది పెరిగినా.. సామాజిక అన్యాయం తప్ప న్యాయం తెలియని పరాన్న జీవులు ఇప్పుడు మీ బిడ్డను ఎదుర్కోలేక కుయుక్తులు పన్నుతారని మండిపడ్డారు.

 jaganmeeting

మంచి చేయటంలో సాటి రాలేక.. మంచి చేసామని చెప్పుకొనే మంచి లేకఎత్తులు ,పొత్తులు, కుయుక్తులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీ బిడ్డ ఒక్కడు ఒక వైపు.. నవరత్నాలతో మీ బిడ్డ ఎదురుగా వస్తుంటే..మహిళల నుంచి వస్తున్న తోడును చూసి తట్టుకోలేక తోడేళ్లు అన్ని ఒక్కటవుతున్నాయని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు.

నాకు ఉన్నది..వాళ్లకు లేనిది ఒక్కటే: తనకు వాళ్ల లాగా అంగ-అర్దం బలం ఉండకపోవచ్చన్నారు. కానీ, దేవుడి దయ, ప్రజల చల్లని ఆశీస్సులు తనకు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తాను పొత్తుల మీద ఆధారపడనని స్పష్టం చేసారు. తనకు కుయుక్తులు పన్నటం..అబద్దాలు చెప్పటం..మోసం చేయటం..పన్నాగాలు తెలయవని పేర్కొన్నారు. ఏదైనా చేసేదే చెబుతానని..చెప్పిందే చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

ప్రతీ ఇంటికి ఈ 46నెలల పాలనలో 2.05 లక్షల కోట్ల రూపాయాల మేరకు ప్రతీ ఇంటికి లబ్ది జరిగేలా చూసామని వివరించారు. మీ ఇంట మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రతీ ఇంట జరిగిన మంచి గురించి చర్చ జరగాలన్నారు. మంచి జరిగిన వారంతా తనకు సైనికులు కావాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.

 jaganmeeting

మనది బతికించే ప్రభుత్వం: ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ అంటే వైయస్‌ఆర్‌ గుర్తకొస్తారని, ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. పేదలు ఆసుపత్రుల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదని, మీ గ్రామానికే, సమీపానికే అన్ని వైద్యసేవలు అందించే గొప్ప కార్యక్రమం ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అన్నారు.

ఈ విధానంలో సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. గతంలో వెయ్యి వ్యాధులకు ఆరోగ్య శ్రీ కింద అందే సేవలను ఇప్పుడు 558 వ్యాధులకు ..పక్క రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లోనూ అందేలా విస్తరించామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+