ఆయన కమెడియన్.. నేను హీరోగా నాటకం వేశాం.. శివప్రసాద్‌ను తలుచుకొని చంద్రబాబు ఉద్వేగం
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత ఎన్ శివ ప్రసాద్‌కు నివాళులర్పిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన పార్ధీవ దేహాన్ని తిరుపతికి తరలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ నివాళులర్పించారు. అంతిమ యాత్రలో చంద్రబాబుతోపాటు లోకేష్ పాల్గొన్నారు. బాధాతప్త హృదయంతో అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు శివప్రసాద్ కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..

శివప్రసాద్ అజాత శత్రువు
శివప్రసాద్ నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అజాత శత్రువు. అలాంటి వ్యక్తికి నేను నివాళులర్పిస్తానని అనుకోలేదు. మేమిద్దరం మంచి మిత్రులం. ఆయన వైద్య వృత్తిలో కొనసాగుతూనే కళలపై మమకారం పెంచుకొన్నారు. కేవలం నామీద నమ్మకంతోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచడానికి శివప్రసాద్ ఎనలేని పోరాటం చేశారు అని చంద్రబాబు అన్నారు.

ఆయన కమెడియన్.. నేను హీరో
ప్రజా సమస్యలను, ప్రభుత్వ వ్యతిరేకతను తన కళారూపంలో తెలియజేసి ప్రజలను చైతన్యపరిచారు. ఓ నాటకంలో ఆయన కమెడియన్‌గా వేషం వేస్తే.. నేను హీరోగా వేషం వేశాను. శివప్రసాద మృతి పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు.

తెలుగు రాజకీయాల్లో శివ ప్రసాద్
ఇక తెలుగు రాజకీయాల్లో శివ ప్రసాద్‌ది ప్రత్యేకమైన శైలి. దేశ పాలిటిక్స్‌లోనూ తన మార్కును వదిలిన ఘనత ఆయనది. తనదైన శైలిలో వివిధ వేషాల్లో కనిపిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడంలో శివ ప్రసాద్ సఫలమ్యారు. బలమైన కార్యకర్తలను, అభిమానులను సంపాదించుకోవడం ఆయన నాయకత్వ ప్రతిభకు సాక్ష్యంగా నిలిచింది.
పార్టీ కష్టాల్లో ఉన్నా..
ఇక తెలుగు దేశం పార్టీ ఎందరో నాయకులు వీడిపోయినా.. శివప్రసాద్ మాత్రం చంద్రబాబుకు వెన్నంటి నిలిచారు. పార్టీ కష్టాల్లో ఉన్నా.. అధికారంలో ఉన్న చివరి శ్వాస వరకు తన సేవలను టీడీపీకి అందించారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిడులు ఎదురైనా గానీ టీడీపీని వదలకపోవడం అతని క్లీన్ పాలిటిక్స్‌కు ఓ మచ్చు తునక అని రాజకీయ వర్గాలు వెల్లడిస్తాయి.

చంద్రబాబుతో అనుబంధం
తెలుగు దేశం అధినేత చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన వాడు కావడంతో ఆయనతో మంచి అనుబంధం ఉండేది. చిత్తూరులో అభివృద్ది పనుల కోసం శివ ప్రసాద్ ఎంతో పాటు పడ్డారని చెబుతారు. ప్రభుత్వ పథకాలను ప్రేక్షకులకు అందించడంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడని చెప్పుకొంటారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications