రఘువీరారెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ - కీలక నిర్ణయం..!!
సీనియర్ పొలిటీషియన్ రఘువీరా రెడ్డి తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ హయాంలో మంత్రిగా పని చేసారు. రాష్ట్ర విభజన తరువాత పీసీసీ చీఫ్ గా పని చేసిన ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. తిరిగి ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారు. తాను రాజకీయ అజ్ఞాతం వీడుతున్నట్లు రఘువీరా స్వయంగా ప్రకటించారు. ఇక, రఘువీరా రాజకీయ కార్యాచరణ ఏంటి.
కొన్నేళ్లుగా క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరా రెడ్డి తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుందామని భావించానని...ప్రధాని మోదీ కాంగ్రెస్ నేత రహుల్ గాంధీ ఒక్క మాట అన్నందుకే ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయటం తన మనసు కలిచి వేసినట్లు రఘువీరా ఆవేదన వ్యక్తం చేసారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవటం భావ్యమా అని ఆలోచించి ప్రజల ముందుకు వచ్చానని రఘువీరా చెప్పారు. రాహుల్ ను అవమానించటం వలన కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కడతారని రఘువీరా చెప్పుకొచ్చారు.
పొలిటికల్ గా రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగనున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలు జరుగుతుండటంతో కాంగ్రెస్ లో తిరిగి యాక్టివ్ అయ్యారు. వస్తూనే కాంగ్రెస్ పార్టీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. బెంగళూరు నగర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా రఘువీరా నియమితులయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అక్కడ పార్టీ అభ్యర్ధుల విజయానికి పని చేస్తానని రఘువీరా ప్రకటించారు.
తనను అభిమనించే వాళ్లు చెప్పినట్లుగా భవిష్యత్ లో నడుచుకుంటానంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. హైకమాండ్ సూచన మేరకే రఘువీరా తిరిగి కాంగ్రెస్ లో చేరారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం కోసం నాలుగేళ్లుగా రాజకీయాల నుంచి విరామం తీసుకున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications