టీడీపీ, బీజేపీతో పొత్తులపై జరిగిందిదే - మనోహర్ కీలక వ్యాఖ్యలు..!!

జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ, బీజేపీ తో పొత్తు దిశగా ఏం జరిగిందో వివరించారు. పొత్తు లక్ష్యాలను స్పష్టం చేసారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనవ్వమనే నిర్ణయానికి కట్టు బడి ఉన్నామని తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించారు. జనసేన ఎప్పడూ ఒకే మాట మీద ఉంటుందన్నారు. సీట్ల గురించి స్పందించారు. జనసేనలో అందరూ అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.

జనసేన లక్ష్యం: తమ లక్ష్యం వైసీపీ విముక్త ఏపీ అని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న దాష్టికాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తామని చెప్పారు. ఏపీకి మేలు జరిగే విధంగా పొత్తులు ఉంటాయని చెప్పుకొచ్చారు. బీజేపీ ముఖ్య నాయకులు, చంద్రబాబుతో పొత్తులపై చర్చలు జరిపామని మనోహర్ వెల్లడించారు. రెండు పార్టీలు కలిసి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే తమ విధానమని వివరించారు. పవన్ కల్యాణ్ చెప్పిన విధంగా పొత్తులు ఉంటాయన్నారు. పొత్తులకు ఎవరైనా కలిసి రాకపోతే రాష్ట్ర భవిష్యత్ కు జరుగుతున్న నష్టాన్ని వివరించి ఒప్పిస్తామని చెప్పుకొచ్చారు.

Nadendla Manohar

పొత్తులకు ఒప్పిస్తాం: ఆ రెండు పార్టీలతో సీట్ల గురించి చర్చలు జరగలేదన్నారు. పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయంపై పార్టీ నాయకులు అందరూ కట్టుబడి ఉంటారని చెప్పారు. అధికారంలోకి రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత మరో మాట జనసేన మాట్లాడదని మనోహర్ పేర్కొన్నారు. రైతుల కోసం వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర చేయాలని మనోహర్ డిమాండ్ చేసారు. దర్శి నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులతో వైసీపీ సర్పంచ్ ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. బటన్ నొక్కే కార్యక్రమం వలన రాష్ట్రంలో ఎంత మందికి లబ్ధి పొందారని ప్రవ్నించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అందకారంలోకి తీసుకెళ్ళిందని మనోహర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల కోసం జనసేన వ్యూహాలను సిద్దం చేస్తోందని చెప్పుకొచ్చారు.

Nadendla Manohar

పొత్తులతో భయం లేదు: ఇదే పొత్తుల అంశం పైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఎవరు ఎవరితో కలిసినా తమకు ఇబ్బంది లేదన్నారు. అసలు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తారో లేదో చూడాలన్నారు. తాము 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధిస్తే.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు. పొత్తులు చూసి భయపడే అవసరం తమకు లేదన్నారు. టీడీపీ లాగా మరో పార్టీ చేయి పట్టుకొని పోరాటం చేయాల్సిన అవసరం తమకు ఉండదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+