శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున, జయసుధ

ప్రముఖ సినీ నటుడు నాగార్జున, అఖిల్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. త్వరలోనే తాను ప్రేక్షకుల ముందుకు వస్తానని నాగార్జున మీడియాతో చెప్పారు. ఉగాదికల్లా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రముఖ సినీ నటి, కాంగ్రెసు శాసనసభ్యురాలు జయసుధ, కాంగ్రెసు బహిష్కృత పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. జయసుధ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడగాలని రాయపాటి సాంబశివ రావు అన్నారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలనే చెబుతానని ఆయన అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రలో కొత్త పార్టీ పెడుతారనే అభిప్రాయం బలంగానే ఉంది. అందుకు రాయపాటి సాంబశివ రావు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications