4 గంటలకు మోడీతో భేటీ, హామీ: అతను నాగార్జునేనా?
అహ్మదాబాద్/హైదరాబాద్: యువసామ్రాట్ అక్కినేని నాగార్జున సోమవారం సాయంత్రం 4 గంటలకు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. మోడీని కలిసేందుకు నాగార్జున అహ్మదాబాదు బయలుదేరారు. మోడీ నాయకత్వంలో గుజరాత్‌లో జరిగిన అభివృద్ధి, ప్రాజెక్టులను నాగార్జున పరిశీలిస్తున్నారు.
వెంకయ్యనాయుడితో సంప్రదింపులు
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి వెంకయ్య నాయుడుతో నాగార్జున సంప్రదింపులు జరిపారు. అనంతరం వెంకయ్య నాయుడు సూచన మేరకు మోడీతో భేటీ అయ్యేందుకు నాగార్జున అహ్మదాబాద్ బయలుదేరారు. మోడీకి మద్దతు పలుకుతానని వెంకయ్యతో నాగార్జున చెప్పినట్లుగా తెలుస్తోంది.
అతను నాగార్జునేనా?
టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరో బిజెపిలో చేరుతారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఇప్పుడు మోడీతో నాగార్జున భేటీ అవుతుండటంతో ఆ హీరో యువసామ్రాటే అని భావిస్తున్నారు. మూడో రోజుల క్రితం వెంకయ్య కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విషయమై మాట్లాడుతూ... రెండు మూడో రోజుల్లో సంచలనం ఉంటుందని చెప్పారు. టాలీవుడ్ టాప్ హీరో బిజెపిలో చేరతారనే వార్తలు రావడం, వెంకయ్య సంచలన వ్యాఖ్యలు చేయడం, మోడీని నాగ్ కలుస్తుండటం చూస్తుంటే బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన పార్టీని స్థాపించడంతో పాటు బిజెపికి మద్దతిస్తానని ప్రకటించారు. మోడీని ఆయన నాలుగు రోజుల క్రితం కలిశారు.

నాగార్జున
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వైపు టాలీవుడ్ ఇండస్ట్రీ చూస్తోంది. నాగ్ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు మోడీతో భేటీ కానున్నారు.

నాగార్జున
టాలీవుడ్ నటుడు నాగార్జున భేటీతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నాగ్ సతీమణి అమల విజయవాడ పార్లమెంటు స్థానం నుండి టిక్కెట్ ఆశిస్తున్నారంటున్నారు.

పవన్
జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత ఇప్పుడు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలువనున్నారు.
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications