పోసాని ప్లేస్‌లో నాగబాబు..?
మెగా బ్రదర్ నాగబాబు గత ఎన్నికల్లో విసృతంగా పని చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాగబాబు కూడా కీలకంగా పనిచేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు. ఒకనొక సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా రెడీ అయ్యారు. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం, సీట్ల సర్దుబాటు విషయంలో నాగబాబు తన సీటును త్యాగం చేశారు. సీటు దక్కకపోయినప్పటికి నాగబాబు ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన విజయం కోసం చెమటోడ్చారు.
అందరు భావించినట్టుగానే కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు కూడా కీలక పదవి దక్కబోతోందన్న ప్రచారం ఊపందుకుంది. నాగబాబును టీటీడీ చైర్మన్‌గా నియమించబోతున్నారన్న ప్రచారం ఇటీవల జరిగింది. అయితే, దానిని ఆయన ఖండించారు. తనకు అలాంటి ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగబాబుని ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కూడా ఇప్పటికే తన సోదరుడి పేరును నిర్ధారించినట్టు పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే నాగబాబు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయంలో నటుడు పోసాని కృష్ణమురళి ఈ పదవిలో కొనసాగారు. ఇదిలా ఉంటే నాగబాబు ఇటీవల మీడియాలోకి సైతం ఎంట్రీ ఇచ్చారు. అన్ని పొలిటికల్ పార్టీలకు ఛానెల్స్ ఉండగా, జనసేన కోసం ఆయన ప్రత్యేకంగా ఓ మీడియా ఛానెల్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ఆయన కీలక ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications