రోజా పై నాగబాబు ఎందుకిలా : ప‌వ‌న్ మాత్ర‌మే ల‌క్ష్య‌మా : జ‌బ‌ర్ధ‌స్త్ ఎఫెక్ట్‌..!

ఏపి ఎన్నిక‌ల్లో కొత్త ట‌ర్న్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా అనేక సార్లు విమ‌ర్శ‌లు చేసారు. కానీ, ఇప్పుడు కొత్త
ఫార్ములా తెర పైకి వ‌చ్చింది. జ‌న‌సేన నుండి న‌ర్సాపుప‌రం ఎంపీగా బరిలో ఉన్న నాగ‌బాబు తాను మాత్రం రోజాను వి మర్శించన‌ని చెబుతున్నారు. కానీ, ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్రం వైసిపి రోజాను ప్ర‌చారం కోసం పంపా ల‌ని డిసైడ్ అయింది.ఈ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రోజా వ‌ర్స‌స్ ప‌వ‌న్ విమ‌ర్శ‌లు మొద‌లు కాలేదు. అయితే, ఇప్పుడు ఏం జ‌ర‌గ‌బోతుంద‌నేదే ఆస‌క్తి క‌రం..

రోజా పై కామెంట్లు చేయ‌ను..

రోజా పై కామెంట్లు చేయ‌ను..

తాము ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన స‌మ‌యంలో రోజా త‌మ పై అనేక ఆరోప‌ణ‌లు..విమ‌ర్శ‌లు చేసార‌ని గుర్తు చేసుకుంటు న్నారు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు. జ‌న‌సేన నుండి న‌ర్సాపురం ఎంపి అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్నారు. ఒక ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూ లో తాను మాత్రం రోజా పై విమ‌ర్శ‌లు చేయ‌న‌ని చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లో రోజా రాజ‌కీయ ప‌రిస్థితుల్లో త‌మ పై విమ‌ర్శ లు చేసినా..త‌మ వైపు నుండీ తిరిగి ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసార‌ని వివ‌రించారు. ఎందుకు అటువంటి నిర్ణ‌యం అంటే మా త్రం అది త‌న ఇష్టం అంటున్నారు. తాను ఒక ఆడ‌పిల్ల‌గా రోజా ను విమర్శించాల‌నే ఆలోచ‌న‌లో లేన‌ని స్ప‌ష్టం చేసా రు. మ‌రి..రోజా సైతం మీ పై విమ‌ర్శ‌లు చేయ‌కుండా ఉంటారా అని ప్ర‌శ్నిస్తే..అది రోజాను ప్ర‌శ్నించాల‌ని నాగ‌బాబు సూచించారు. అప్ప‌ట్లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌ను గుర్తు పెట్టుకొని మరీ..ఇప్పుడు తిరిగి రోజాను రాజ‌కీయంగా ల‌క్ష్యం గా చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని నాగ‌బాబు చెప్పుకొచ్చారు.

ప‌వ‌న్ పైకి రోజా అస్త్రం..!

ప‌వ‌న్ పైకి రోజా అస్త్రం..!

ఇప్పుడు రాజ‌కీయంగా చంద్ర‌బాబు తో పాటుగా ప‌వ‌న్ ను వైసిపి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధిగా నే భావిస్తోంది. ప‌వ‌న్ త‌న ఓట్ల ద్వారా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌లో చీలిక తెచ్చి త‌మ‌ను ఓడించేందుకే ప‌వ‌న్ రంగంలోకి దిగార‌ని వైసిపి భావిస్తోంది. దీం తో చంద్ర‌బాబు..వ‌ప‌న్ మ‌ధ్య ఒప్పందం ఉందంటూ జ‌గ‌న్ సైతం ఎన్నిక‌ల ప్ర‌చారం లో చెబుతూ వ‌స్తున్నారు. ఇక‌, ప‌వ‌న్ పోటీ చేసే భీమ‌వ‌రం..విశాఖ లోని గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల్లో రోజాను ప్ర‌చారంలోకి దింపాల‌ని వైసిపి ఇప్ప‌టికే నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం న‌గ‌రి లో త‌న సొంత విజ‌యం కోసం రోజా బిజీగా ఉన్నారు. అక్క‌డ ఒక అంచ‌నాకు వ‌చ్చిన త‌రువాత రోజా వ‌రుస‌గా రెండు రోజుల పాటు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో విస్తృతంగా ప‌ర్య‌టించేలా ప్ర‌ణాళిక లు సిద్దం చేస్తున్నారు. అదే విధంగా.. రోజా తో పాటు ఆలీని ప్ర‌చారానికి దించాల‌ని డిసైడ్ అయ్యారు.

కొత్త ఫార్ములా పై చ‌ర్చ‌

కొత్త ఫార్ములా పై చ‌ర్చ‌

జ‌బ‌ర్ద‌స్త్ న్యాయ నిర్ణేత‌లుగా ఉన్న నాగ‌బాబు.. రోజా ఇప్పుడు పొలిటిక‌ల్ బ్యాటిల్ లోనూ గొడ‌వ ప‌డ‌కూడ‌ద‌ని నిర్ణ‌యిం చిన‌ట్లు క‌నిపిస్తోంది. రోజా పై త‌మ‌కు ఎటువంటి వ్య‌తిరేక‌త లేద‌ని నాగ‌బాబు తేల్చి చెప్పారు. రోజా సైతం ఇప్ప‌టి దాకా నాగ‌బాబు పై ఎటువంటి విమ‌ర్శ‌లు చేయ‌లేదు. అయితే, వ‌ప‌న్ క‌ళ్యాన్ పై మాత్రం త‌ప్ప‌లేదు. ఈ ఎన్నిక‌ల్లో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ పైనా రాజ‌కీయంగా మాట‌ల యుద్దం ప్రారంభించ‌లేదు. త‌న స‌హ‌జ శైలి ప్ర‌కారం రోజా ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టాల్సి ఉంది. అయితే, పూర్తిగా సొంత నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం కావ‌టంతో..ఇంకా దృస్టి సారించ‌లేదు. అయితే, ఈ నెల‌5వ తేదీ నుండి రోజా ఇత‌ర జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌స్తున్నారు. ఇప్పుడు నాగ‌బాబు ప్ర‌తిపాదించిన కొత్త ఫార్ములా ఎటువంటి ప్ర‌భావం చూపుతుంది..ప‌వ‌న్ పై రోజా ఏ ర‌కంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+