పెద్ద దొంగ.. చిన్న దొంగ, బాబును చూసి జగన్‌కు అసూయ: ఎందుకో చెప్పిన నాగబాబు

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లో సోదరుడు నాగబాబు ఇటీవల 'మై ఛానల్ నా ఇష్టం' పేరుతో యూట్యూబ్ ఛానల్లో విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన సోదరుడు జనసేనానిపై, కుటుంబంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం నేపథ్యంలో ఆయన దీనిని ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి ఆయన అందరినీ ఏకిపారేస్తున్నారు.

ఈ మధ్య ప్రతిపక్ష నాయకుడు, మన ప్రియతమ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఇటీవల సెన్షేషనల్ జర్నలిస్ట్ రజనీకాంత్ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు ఎంతో నిజాయితీగా సమాధానం చెప్పారని పేర్కొన్నారు. మన మనస్సులో ఉన్న భావం కొన్ని సందర్భాలలో అనుకోకుండా బయటకు వస్తుందని, అలాగే జగన్ నుంచి వచ్చిందని చెప్పారు. ఆయన చాలా బాగా చెప్పారని పేర్కొన్నారు.

జగన్ ఎంత బాగా చెప్పారంటే

జగన్ ఎంత బాగా చెప్పారంటే

జగన్ ఎంతో బాగా చెప్పారని, తాను ఏం చేశానో, ఎలా ఉన్నాడో, ఏ స్టేజ్‌లో ఉన్నాడో చెప్పాడని నాగబాబు అన్నారు. దీనిని ఓసారి వినండి అంటూ.. జగన్ ఏమన్నాడో పేర్కొన్నారు. 'ఎందుకు మీరు ఆ చంద్రబాబు గారిని ఈ మాటలు అడగరు? అడగాలి అంటే ఆయన చేసిన అవినీతి అట్లుంది. అక్కడ దాని మీద ఎంక్వయిరీ ఏ స్టేజిలో జరుగుతుందో నాకు అయితే తెలీదు. బహుశా నా స్టేజీ కూడా దాటిపోయి కోర్టు స్టేజి కూడా దాటిపోయి ఉంటుంది.. వైయస్ జగన్' అని జగన్ అన్న వ్యాఖ్యలను పేర్కొన్నారు.

పెద్ద దొంగ, ఓ మాదిరీ దొంగ

పెద్ద దొంగ, ఓ మాదిరీ దొంగ

ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. ఇక్కడ మనం ఓ విషయం గమనించాలని, అతను నా కంటే చాలా గొప్పవాడు.. అంటే అర్థం ఏమిటంటే, అతను నా కంటే గొప్పవాడు, కానీ నేను కూడా గొప్పవాడిని అని అర్థమని జగన్ ఉద్దేశ్యమని చెప్పారు. నేను ఎంతో కొంత సాధిస్తే, అతను నా కంటే బాగా బాగా సాధించాడని దాని అర్థమన్నారు. కొన్ని సందర్భాలలో వాడు నాకంటే పెద్ద ఎదవ అంటుంటా.. ఇక్కడ అదే జరిగిందని, వాడు పెద్ద ఎదవ, నేను మాత్రం ఓ రేంజ్ ఎదవని అని జగన్ ఉద్దేశ్యంలో కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. నా కంటే దుర్మార్గుడు అంటే.. నేను దుర్మార్గుడినేనని, నా కంటే పెద్దదొంగ అంటే నేను ఓ మాదిరి దొంగను అని అర్థమని చెప్పారు.

 జగన్ చెప్పిందాంట్లో నిజం

జగన్ చెప్పిందాంట్లో నిజం

ఇక్కడ జగన్ చెప్పిన దాంట్లో కూడా అదే ఉందని నాగబాబు చెప్పారు. తన కేసులు ఏ స్టేజీలో ఉన్నాయే జగన్ చెప్పకనే చెప్పారని అభిప్రాయపడ్డారు. ఆయన కేసులో నా స్టేజీని దాటి ముందుకు వెళ్లిపోయాయని చెప్పారని గుర్తు చేశారు. తద్వారా నాకు ఓ స్టేజీ ఉందని, నాపై కొన్ని కేసులు ఉన్నాయని, ఇది నా రేంజ్, ఆయన (చంద్రబాబు) నాకంటే ఎక్కువ వెళ్లిపోయారని చెప్పాడని అన్నారు. ఓ రకంగా చంద్రబాబును చూసి (కేసుల్లో తన కంటే ఎదగడంపై) జగన్ అసూయ పడుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

 లోకేష్ పైన సెటైర్

లోకేష్ పైన సెటైర్

నాగబాబు మంత్రి నారా లోకేష్ పైన కూడా సెటైర్లు విసిరారు. అన్నా.. ఒకటి ఆలోచించండి, పొరపాటున కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనం మన ఉరి తీసుకున్నట్లే అవుతుందని లోకేష్ చెప్పినట్లుగా వచ్చిన దానిపై కామెంట్ చేశారు. తద్వారా లోకేష్ తన మనసులోని మాట బయట పెట్టారన్నారు. లోకేష్ చాలా బాగా చెప్పారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+