2019 ఎన్నికల్లో పవర్‌లోకి పవన్ కళ్యాణ్, కానీ: నాగబాబు ట్విస్ట్
2019 ఎన్నికల్లో తన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవర్‌లోకి వస్తాడని నటుడు, మెగా సోదరుడు నాగబాబు అన్నారు.
హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవర్‌లోకి వస్తాడని నటుడు, మెగా సోదరుడు నాగబాబు అన్నారు.
తనకు రాజకీయ అనుభవం లేదని, తనకు అధికారం యావ లేదని పవన్ చెబుతుంటే.. నాగబాబు మాత్రం రెండేళ్ల తర్వాత జనసేన చీఫ్ అధికారంలోకి వస్తాడని జోస్యం చెబుతున్నారు.

పవన్ అధికారంలోకి వస్తారు.. ఓ ఓటరుగా నమ్ముతున్నా
అయితే, ఇక్కడ నాగబాబు మరో మాట కూడా చెప్పారు. ఇది ఓ ఓటరుగా తన నమ్మకం అని చెప్పారు. నీతి, నిజాయితీగల పవన్ వంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం ఎంతో అవసరమని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అందుకే సినిమాల్లో నటిస్తున్నాడు
పవన్ కళ్యాణ్ ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదని, పైగా ఇతరుల కోసం తన డబ్బును ఖర్చు చేశాడని, ఓ రాజకీయ పార్టీ నడపాలంటే డబ్బు చాలా అవసరమని నాగబాబు వ్యాఖ్యానించారు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలలో నటిస్తున్నాడని తెలిపారు.

టిడిపి చెప్తోంది కానీ కనిపించట్లేదు
నాగబాబు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సర్కారు పైన కూడా విమర్శలు చేశారు. రాజధాని అమరావతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నారు తప్పు అలాంటివి ఏమీ తమకు కనిపించడం లేదన్నారు

తమ్ముడికి జోష్
తెలుగుదేశం పైన అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నాయన్నారు. అధికార దుర్వినియోగం జరుగుతోందని చెబుతున్నారన్నారు. ఇప్పటికే ఏపీలో అధికారంలో ఉన్న టిడిపిని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పవన్ నిలదీస్తున్నారు. ఆయనకు తోడుగా ఇప్పుడు నాగబాబు కూడా విమర్శలు చేయడం గమనార్హం. ఇది పవన్‌కు జోష్ కలిగించేదే అంటున్నారు.












Click it and Unblock the Notifications