అమ్మ నాగబాబూ..! చంద్రబాబును తిట్టావా..? పొగిడావా..? అర్థం కాకుండా చురకలు అంటించావుగా..!!
అమరావతి/హైదరాబాద్ : ఎంతైనా మెగా కుటుంబ సభ్యుల స్టైల్ చూడముచ్చటగా ఉంటుంది. జబర్థస్త్ కార్యక్రమం ద్వారా చాలా ప్రాచూర్యం పొందిన నాగబాబు నవ్వు గురించి, ఆహార్యం గురించి, డైలాగుల గురించి చెప్పల్సిన అవసరం ఉండదు. సినిమా ఫంక్షన్లలో, ఆడియో విడుదల కార్యక్రమాల్లో మెగా బ్రదర్స్ చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఇక అదే కుటుంబంలో పవన్ కళ్యాణ్ దారి రహదారిలో అన్నట్టు ఉంటుంది.
జనసేన పార్టీ స్థాపించి క్షణం తీరిక లేకుండా ప్రచార కార్యక్రమం, పార్టీ అభ్యర్థుల ఎంపిక, భీ ఫామ్ ల పంపకం వంటి కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీ తనుపునుండి లోక్ సభ బరిలో పోటీ చేయబోతున్నారు జనసేనాని సోదరుడు నాగబాబు. ఈ సందర్బంగా నాగబాబు ఓ వీడియో విడుదల చేసారు. ఆ వీడియోలో నాగబాబు ఏపి సీయం చంద్రబాబుకు సున్నితంగా, అర్థం అయ్యి కానట్టు, తిడుతూనే పొగుడతున్నట్టు చురకలు అంటించారు.

చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చాయి.. ఇంకా ఎంతకాలం ప్రజా పేవలో ఉండమంటారంటూ ఏపి ప్రజలకు ఆయన సూటి ప్రశ్న వేసారు. వయసు మీద పడుతున్నా ఇంకా ఆయన 24/7పని చేయాల్సిందేనా..? మనవుడు దేవాంష్ తో ఎప్పుడు ఆడుకోవాలటూ సున్నితంగా ప్రశ్నించారు. ఆవేశంగా మాట్లాడుతూనే చంద్రబాబు పై సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు మాట్లాడారు నాగబాబు. ఎన్నో సంవత్పరాలుగా ఫామిలీకి, ఇంటికి దూరంగా ఉంటూ ప్రజా సేవకే అంకితమైన చంద్రబాబుకు ఇక విశ్రాంతి నివ్వండని వేడుకున్నారు.
రాజకీయ కోణం మాట్లాడకుండా, రాజకీయ ఉపన్యాసం ఇవ్వకుండా చంద్రబాబు వ్యక్తి గత అంశాలపైనే కాకుండా ఆయన ఆరోగ్యం పై పెద్ద యెత్తున శ్రద్ద చూపించే వ్యక్తిగా నాగబాబు వీడియో పోస్టు చేసారు. ఐతే వీడియోలో నాగబాబు ఎలా మాట్లడినా ఇక రాజకీయాలకు, ప్రజా సేవకు చంద్రబాబు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటే మందచి అన్నట్టు మాట్లాడారు నాగబాబు. ఎంతైనా జబర్దస్త్ స్కిట్లు చూసీ చూసీ నాగబాబు కూడా చంద్రబాబు మీద ఓ స్కిట్టు చేసినట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్..












Click it and Unblock the Notifications