పవన్ కళ్యాణ్‌పై విమర్శలు: సమాధానం ఇవ్వాలని తమ్ముడికి నాగబాబు
అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆయనకు మద్దతు పలికారు. మొదటి నుంచి మెగా బ్రదర్.. తన తమ్ముడికి అండగానే ఉంటున్నారు.
పవన్ కళ్యాణ్‌పై నిన్న రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేసినా, ఇప్పుడు ఇంకొకరు విమర్శలు గుప్పించినా.. తన తమ్ముడు ఏదైనా ఆలోచించి, అవగాహన చేసుకొని క్లారిటీతో మాట్లాడుతాడని నాగబాబు పునరుద్ఘాటించారు.

నాగబాబు కౌంటర్ మహేష్ కత్తికేనా
ఇటీవల నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా విమర్శకులని మనం అలాగే వదిలేస్తే, తప్పు మనదే అవుతుందని చెప్పారు. మనల్ని ఎవడన్నా తిడుతోంటే భరించడం తప్పేనని వ్యాఖ్యానించారు. ఇటీవల మహేష్ కత్తి వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగబాబు అని ఉంటారని తెలుస్తోంది.

సమాధానం ఇవ్వాల్సిందేనని
గతంలో రామ్ గోపాల్ వర్మ విమర్శలు చేసినప్పుడు కూడా నాగబాబు ఘాటుగా స్పందించారు. విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిందేనని నాగబాబు అభిప్రాయపడ్డారు. తద్వారా పవన్ కళ్యాణ్‌కు కూడా సూచన చేశారని చెప్పవచ్చు. కాగా, రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలోనే తనపై చేసిన విమర్శకులకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్‍కు అండగా
పవన్ కళ్యాణ్ పైన విమర్శలు వచ్చినప్పుడు నాగబాబు ఎప్పుడు సోదరుడికి అండగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా ప్రస్తుత వివాదం నేపథ్యంలో తమ్ముడిని సమర్థించారు. తన సోదరుడు అందరి గురించి ఆలోచిస్తాడని, సమ సమాజం కోసం చూస్తాడని నాగబాబు చెబుతుంటారు.

పవన్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది
కొద్ది రోజుల క్రితం మహేష్ కత్తి.. పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌కు ఇటీవల ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురిపించారు. దీనిపై మహేష్ కూడా తీవ్రంగా స్పందించారు. తాను ఒక క్రిటిక్ అని, విమర్శలు చేస్తానని చెప్పారు.

ఇలా తప్పుపట్టడం ఏమిటని
అయితే, పవన్ కళ్యాణ్ చేసే ప్రతి అంశంపై ఆయన నేరుగా స్పందిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల అంశం సందర్భంలో పవన్ మాట్లాడుతూ.. సమ సమాజం నిర్మితం కావాలని, రిజర్వేషన్లు లేని సమాజం కావాలని పవన్ మాట్లాడితే దానిని మరో రకంగా అర్థం చేసుకొని విమర్శలు చేయడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. దీనిపై ఇరువురికి అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్లు వస్తున్నాయి.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు











Click it and Unblock the Notifications