సంబంధం లేదు: పవన్‌పై నాగబాబు, చిరు వైపే
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నేపథ్యంలో మెగా సోదరుల మధ్య చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. చిరంజీవి సోదరుడు, ప్రముఖ నిర్మాత నాగబాబు పవన్ కొత్త పార్టీ పైన గురువారం స్పందించారు. నాగబాబు మాట తీరు చూస్తుంటే పవన్ పార్టీ పైన ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
తన సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖ చిరంజీవి.. తనకు, పవన్ కల్యాణ్‌కు, రామ్ చరణ్ తేజకు రాచబాట పరిచారని వ్యాఖ్యానించారు. ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే అది వారిష్టమని చెప్పారు. తాను, మెగా అభిమానులు మాత్రం చిరంజీవి వెంటనే ఉంటారని నాగబాబు చెప్పారు. తమ పేరు చెప్పుకొని ఎవరేం చేసినా తాము బాధ్యులం కాదన్నారు. మెగా అభిమానులు అంతా చిరు వెంటే ఉన్నారన్నారు.

కొన్నాళ్ల తర్వాత వస్తే బాగుండు: అవంతి
పవన్ కల్యాణ్ ఇప్పుడు కాకుండా కొన్నాళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెడితే బాగుండునని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గురువారం అన్నారు.
ఉమ్మడి గుర్తు కష్టమేనా?
పవన్ కల్యాణ్ ఈ నెల 10న కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్పాయని తెలుస్తోంది. పార్టీ గుర్తింపు ప్రక్రియకు నాలుగు నెలలు పడుతుందని చెప్పారు. పవన్ పార్టీ అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేయాలన్నారు. పవన్ పార్టీకి ఇప్పట్లో గుర్తింపు రావడం కష్టమేనని చెప్పారని తెలుస్తోంది. ఉమ్మడి ఎన్నికల గుర్తింపు కూడా కష్టమేనని వ్యాఖ్యానించారట.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/7l8I06JjFwc?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications