ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రసంగం.. ఎవరూ ఊహించని టాపిక్‌పై గళం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శాసనసభ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభను బహిష్కరించినా, శాసనమండలిలో మాత్రం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో, శాసనమండలి చర్చలు కీలక అంశాలుగా మారుతున్నాయి. తాజాగా, జనసేన పార్టీ తరపున మండలిలోకి అడుగుపెట్టిన మెగా బ్రదర్, నటుడు నాగబాబు ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మండలి లో ఎమ్మెల్సీ నాగబాబు తొలి స్పీచ్..!
— oneindiatelugu (@oneindiatelugu) September 23, 2025
పొలిటికల్ సెన్సిటివ్ కేసులపై ఎలాంటి పక్షపాతం లేకుండా స్వతంత్ర దర్యాప్తు జరిగే వ్యవస్థలుండాలి
- ఎమ్మెల్సీ నాగబాబు#NagaBabu #NagaBabuKonidela #PoliticsToday #AndhraPradesh #Oneindia #OITelugu pic.twitter.com/YQ6b6GbyeM
ఎమ్మెల్సీగా నాగబాబు ప్రస్థానం
నాగబాబు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషికి గానూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. చట్టసభల్లో సభ్యుడుగా లేని కారణంగా, ముందుగా ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. త్వరలో ఆయనకు మంత్రి పదవి లభించడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగబాబు ఎన్నికతో శాసనమండలిలో జనసేన బలం పెరిగింది.

శాసనమండలిలో తొలి ప్రసంగం
మొదటిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టిన నాగబాబు, మొదట్లో కొంత సైలెంట్‌గా ఉన్నప్పటికీ, ఈరోజు ఆయన చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. కూటమి ,వైఎస్సార్‌సీపీ సభ్యుల నుంచి శుభాకాంక్షలు అందుకున్న తర్వాత, ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా, దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పోలీసు కేసుల గురించి ఆయన గణాంకాలతో సహా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం చూపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
.












Click it and Unblock the Notifications