శివ భార్య నాగలక్ష్మి మారాం: ఆమె కూడా చైన్ స్నాచింగ్

హైదరాబాద్: పోలీసు కాల్పుల్లో మరణించిన కడలూరి శివ అలియాస్ సాంబ ముఠా విషయంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. శివతో పాటు అతని భార్య నాగలక్ష్మి కూడా గొలుసులను లాక్కుని పెరుగెత్తే విద్యను నేర్చుకుందని సమాచారం. తానూ స్వయంగా చైన్ స్నాచర్ అవతారం ఎత్తింది.

తమ కస్టడీలో ఉన్న నాగలక్ష్మి, జగదీష్, రాజ్‌కుమార్‌లను నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. నాగలక్ష్మి నేరుగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులకు విచారణలో తెలిసిందని అంటున్నారు. స్నాచింగ్‌లకు ముందు నాగలక్ష్మి తొలినాళ్లలో రెక్కీ నిర్వహించేది. అయితే, తాను కూడా చైన్ స్నాచింగ్‌లు చేస్తానని మారాం చేయడంతో భార్య నాగలక్ష్మిని శివ అనుమతించినట్లు చెబుతున్నారు.

Nagalakshmi participated in chain snatching along with Shiva

అయితే, ఆమె స్వయంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన కేసులు మల్కాజిగిరి డిసిపి జోన్ పరిధిలో నమోదైనట్లు చెబుతున్నారు. శివ కారును నడిపిస్తుంటే, వెనుక సీట్లో కూర్చుని నాగలక్ష్మి కారు దిగి, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి మహిళల మెడలోంచి మంగళసూత్రాలను లాక్కుని పరుగెత్తుకుంటూ వచ్చి తిరిగి కారులో కూర్చుని పారిపోయేదని అంటున్నారు.

చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న శివ అనుచురులు ముగ్గురిని రెండు రోజుల క్రితం కోర్టు అనుమతితో నార్సింగ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ ముఠా తాకట్టు పెట్టిన బంగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+