'నీతు అగర్వాల్‌పై దాడి చేయలేదు, నీళ్లకు డబ్బులడిగా'

కర్నూలు: నటి నీతూ అగర్వాల్ పైన తాను దాడి చేసినట్లుగా వచ్చిన వార్తలను నాగరాజు ఖండించాడు. కర్నూలు జిల్లాలోని నంద్యాల సబ్‌ జైలులో నీతూకు తాను నీళ్ల బాటిల్స్ ఇచ్చేవాడినని చెప్పాడు. వాటికి తాను డబ్బులు ఇవ్వమని మాత్రమే అడిగానని చెప్పాడు.

ఆమె పైన తాను దాడి చెయ్యలేదని చెప్పాడు. నీతూ అగర్వాల్ తన పైన అనవసర ఆరోపణలు చేస్తోందన్నాడు. తాను తాను ఇచ్చిన నీళ్ల బాటిళ్లకు మాత్రమే డబ్బులు అడిగానని, దాడి మాత్రం చేయలేదని చెప్పాడు.

Nagaraju condemns attack on Neetu Agarwal

కాగా, నీతూ అగర్వాల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏ-1 ట్రావెల్స్‌ యజమాని నాగరాజు రోడ్డుకు అడ్డంగా కారు పెట్టి, తన కారు తాళం తీసుకుని, రూ.ఐదువేలు ఇవ్వకుండా వెళ్తున్నావా అని, డ్రైవర్‌ను, తననూ నాగరాజు బెదిరించాడని ఆరోపించింది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టై, ఇటీవల బెయిల్ పైన విడుదలైన నీతూ అగర్వాల్ ఆదివారం నాడు రుద్రవరం పోలీసు స్టేషన్లో సంతకం చేసింది. అనంతరం హైదరాబాదుకు తిరుగు పయనమయింది. ఆ సమయంలో నంద్యాల సమీపంలో నాగరాజు ఆమెను అడ్డుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+