వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కువైట్‌లో హడావుడి, అరెస్ట్ ప్రచారం: పోలీసులు అందుకే వచ్చారని, అరెస్ట్ కాదని రోజా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాను కువైట్‌లో అదుపులో తీసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఆమె కొట్టి పారేశారు.

|
Google Oneindia TeluguNews

కువైట్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాను కువైట్‌లో అదుపులో తీసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఆమె కొట్టి పారేశారు. తాను కేవలం అతిథిగా మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నానని, తనపై దుష్ప్రచారం సరికాదన్నారు.

హడావుడి చేశారని

హడావుడి చేశారని

కువైట్‌లో ఓ హోటల్లో వైసిపి కువైట్ శాఖ ఏర్పాటు చేసిన నవరత్నాలు కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. అయితే పార్టీ సభ్యులు అక్కడ హడావుడి చేశారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం జరిగింది.

రోజాను అరెస్టు చేశారని

రోజాను అరెస్టు చేశారని

ఈ నేపథ్యంలో రోజాతో పాటు వైసిపి నాయకులను అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రోజా స్పందించారు.

సమావేశం విజయవంతమని రోజా

సమావేశం విజయవంతమని రోజా

నిన్న కువైట్‌లో జరిగిన వైకాపా నవరత్నాలు కార్యక్రమంలో పాల్గొన్నా. దాదాపు రెండు వేలమంది పార్టీ శ్రేణులు హాజరయ్యారని రోజా ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమావేశం విజయవంతంగా జరిగిందన్నారు.

పోలీసులు అందుకే అభ్యంతరం తెలిపారు

పోలీసులు అందుకే అభ్యంతరం తెలిపారు

ఎక్కువ మంది ఒకేచోట సమావేశమవడంతో కువైట్‌ పోలీసులు అక్కడికి చేరుకుని అభ్యంతరం తెలిపారని రోజా చెప్పారు. నిర్వాహకులు సర్దిచెప్పడంతో పోలీసులు శాంతించారని తెలియజేశారు. ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు.

ఇలాంటి వార్తలు రాయొద్దు

ఇలాంటి వార్తలు రాయొద్దు

ప్రస్తుతం తాను దుబాయ్‌లోని మిత్రుల ఇంట్లో ఉన్నానని రోజా స్పష్టం చేశారు. తనను సంప్రదించకుండా ఇలాంటి వార్తలు రాయవద్దని మీడియాకు సూచించారు. తనను కువైట్‌ పోలీసులు అరెస్టు చేశారని వార్తలు వస్తున్నాయని మిత్రులు ఫోన్‌ చేసి చెప్పడంతో తాను స్పందించినట్లు తెలిపారు.

English summary
Nagari YSR Congress Party MLA Roja not arrested in Kuwait. She responded on her arrest rumors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X