రేపే నాగుల చవితి- పూజ, పుట్టలో పాలు పోయటానికి శుభ సమయాలు ఇవే..!!

నాగుల చవితి పండుగను తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున వివాహిత మహిళలు తమ పిల్లల ఆయురారోగ్యాలు, క్షేమం, దీర్ఘాయుష్షు కోసం నాగ దేవతలను పూజిస్తారు. కుటుంబానికి సుఖసంతోషాలు, సర్పదోషాల నుంచి రక్షణ కలగాలని ప్రార్థిస్తారు. 2026లో నాగుల చవితి పండుగను నవంబర్ 13, శుక్రవారం జరుపుకోనున్నారు. ఇదే రోజున పుట్టలో పాలు పోసి భక్తి చాటుకుంటారు. ఇందుకు సంబంధించి ముహూర్తాలను పండితులు వెల్లడించారు.

కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితి తిథిని నాగుల చవితిగా జరుపు కుంటారు. హిందూ పంచాంగం ప్రకారం 2026 నవంబర్ 13న నాగుల చవితి పూజకు శుభ ముహూర్తం ఉదయం 11:01 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంటల వరకు ఉంది. ఈ సమయంలో భక్తులు నాగ దేవతలకు పూజలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు. అదే విధంగా చవితి తిథి నవంబర్ 12 సాయంత్రం 6:09 గంటలకు ప్రారంభమై నవంబర్ 13 రాత్రి 8:42 గంటలకు ముగుస్తుంది. నాగుల చవితి రోజున మహిళలు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి నాగ దేవతలను ఆరాధిస్తారు. తమ పిల్లలకు ఎలాంటి ఆపదలు కలగకుండా చూడాలని, వారు ఆరోగ్యంగా, సంతోషంగా, దీర్ఘాయుష్షుతో జీవించాలని ప్రార్థిస్తారు.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
nagula-chavithi-2026-auspicious-timings-to-offer-milk-at-snake-anthills-revealed-details-here

భక్తి శ్రద్దలతో చవితి పూజలు

ఇక, నవంబర్ 13 శుక్రవారం దుర్ముహూర్తం ఉదయం 8.22 నుంచి 9.07 వరకు తిరిగి.. మధ్యాహ్నం 12.08 నుంచి 12.54 వరకు వర్జ్యం రాత్రి 2.14 నుంచి 4.01 వరకు వర్జ్యం ఉంది. దీంతో, దుర్ముహూర్తం లేని సమయం చూసి నాగేంద్రుడి పూజ చేయటం మంచిదని సూచన చేస్తున్నారు. ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 1:10 మధ్య పూజలు చేయడం శ్రేయస్కర మని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పుట్ట దగ్గర పాలు పోయడం, నైవేద్యాలు సమర్పించడం మంచిదని పండితులు చెబుతున్నారు. చవితి రోజు పుట్ట పూజలు చేసేటప్పుడు పసుపు, కుంకుమతో పాటుగా కొన్ని రకాల నైవ్యేద్యాలు సమర్పిస్తారు. ప్రాంతీయ ఆచారాల బట్టి కొన్ని చోట్ల నువ్వులతో చేసిన చిమ్మిలి, మరికొన్ని చోట్ల చలిమిడి, వడపప్పు, పండ్లు, కొబ్బరికాయలు నైవేద్యంగా పెడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+