"ఏపీకి గూగుల్ డాటా సెంటర్.. లోకేష్ కీలక పాత్ర"
ఏపీలో గూగుల్ పెట్టుబడుల వెనుక ఐటీ మంత్రి లోకేష్ కీలక పాత్ర ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ సంస్థను లోకేష్ సంప్రదించారని గుర్తుచేశారు. నిరంతరం ఫాలో అప్ చేయడం వల్లే లక్ష్యాన్ని చేరుకున్నామని సీఎం అన్నారు. ఏపీ బ్రాండ్ పునరుద్ధరణతోనే భారీ పెట్టుబడులు సాధించామని అన్నారు. విశాఖలో గూగుల్ డాటా సెంటర్ దేశానికే తలమానికం అని సీఎం చంద్రబాబు వర్ణించారు. ఏఐ డాటా సెంటర్ తో విద్య, వైద్యం, వ్యవసాయం సహా అనేక రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలిపారు. ఈ మేరకు గూగుల్ ఇన్వెస్ట్ మెంట్ పై శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు.
ఏపీకి గూగుల్ డాటా సెంటర్ రావడంలో ఐటీ మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ సంస్థను సంప్రదించి నిరంతరం ఫాలో అప్ చేయడం వల్లే లక్ష్యాన్ని చేరుకున్నామని సీఎం అన్నారు. ఏపీ బ్రాండ్ పునరుద్ధరణతోనే 16 నెలల్లో భారీ పెట్టుబడులు సాధించామని చంద్రబాబు అన్నారు. గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు ఏపీ చరిత్రలోనే కాకుండా దేశ ఐటీ చరిత్రలోనే ఇదొక పెద్ద మలుపు కానుందని తెలిపారు.
హైదరాబాద్ దశ దిశ నాడు మైక్రోసాఫ్ట్ తో మారిందని అదే విధంగా నేడు ఏపీలో గూగుల్ డాటా సెంటర్ ఆ పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దిల్లీలో గూగుల్ సంస్థ నిర్వహించిన భారత్ ఏఐ శక్తి సదస్సులో పాల్గొన్న అనంతరం అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు శుభాకాంక్షలతో స్వాగతం పలికారు. థాంక్యూ సీఎం సార్, గూగుల్ కమ్స్ టు ఏపీ అంటూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలతో సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు.
ఏఐ డాటా సెంటర్ తో విద్య, వైద్య, వ్యవసాయంలో కీలక మార్పులు
ఏఐ డాటా సెంటర్ ఏర్పాటుతో విద్య, వైద్యం, వ్యవసాయం సహా అనేక రంగాల్లో కీలక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇటువంటి సంస్థల రాకతో కలిగే మేలును ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. సామాన్యులకు సైతం డేటా సెంటర్ ప్రయోజనాలేంటో తెలిసేలా అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రానికి వచ్చిన ఈ భారీ పెట్టుబడి తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
"30 ఏళ్ల క్రితం ఐటీని ప్రోత్సహించినప్పుడు నాడు సమాజంలో ఆ రంగంపై ఇంత అవగాహన, చర్చ, పోటీ లేదు. కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఉన్న అవకాశాలను నాడు ఊహించి ప్రణాళికలు అమలు చేశాం. దీనికోసం అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నాం. నాడు ముఖ్యమంత్రులు కంపెనీల కోసం విదేశాలకు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించిన సందర్భాలు లేవు. అయితే విదేశాల్లో తిరిగి, దావోస్ పెట్టుబడుల సదస్సులకు వెళ్లి పరిశ్రమలు తెచ్చేందుకు పయత్నాలు చేశాం.

అనేక ప్రయత్నాలతోనే హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ సహా అనేక కంపెనీలను తెచ్చి ఐటీకి పునాది వేశాం. నాడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చేసింది. అనేక కంపెనీలు రావడానికి నాడు మైక్రోసాఫ్ట్ కారణం అయింది. నేడు విశాఖకు వస్తున్న గూగుల్ ఏఐ డాటా సెంటర్ పెట్టుబడి కూడా అంతే ప్రభావాన్ని చూపుతుంది. విశాఖను ఐటీ హబ్‌గా చేసేందుకు మనం చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో పెద్ద ముందడుగు" అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
-
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications