Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"మానవరూపంలోని దేవుడు శ్రీ సత్యసాయి.. కోట్లమందికి వెలుగులు పంచారు"

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతున్న పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 18న బాబా రథోత్సవంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి శతజయంతి వేడుకలతో ముగుస్తాయి. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడారు. శ్రీ సత్యసాయి బాబా సేవలను వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నానని అన్నారు. సత్యసాయి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బాబా ఇక్కడికి రప్పించారని.. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని తెలిపారు. వసుధైక కుటుంబం భారతీయులకు మూలం.. సత్యసాయి బోధనల ద్వారా దాన్ని నిలబెట్టుకుందామన్నారు.

" 1926 నవంబర్ 23వ తేదీన భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమిలో ఒకలక్ష్యం కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవనప్రమాణాన్ని సాగించి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారు. సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవ చింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు. 1940 మే 23న సత్యసాయి వయసు 14 ఏళ్లు.. అప్పుడే ఆయన సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వాసన నామాన్ని వదలుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు" అని సీఎం చంద్రబాబు అన్నారు.

"దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు. శ్రీ సతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్యానికి నిలయంగా మార్చారు. మావన రూపంలో
మనం చూసిన దైవమే సత్యసాయి బాబా.. బాబా శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం అందరి అదృష్టం. లవ్ ఆల్, సర్వ్ ఆల్వ్..హెల్ప్ ఎవర్, హర్ట నెవర్ అని సత్యసాయి బోధించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా సిద్ధాంతాలతో నూతన అధ్యాయం ప్రారంభించారు. 1960లో బాబా స్థాపించిన సత్యసాయి సంస్థలతో సేవలకు రూపం వచ్చింది. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారు. భగవాన్ మనోదర్శనం ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, ప్రముఖులు వచ్చి ఆయన సేవా మార్గాన్ని అనుసరించారు"

" ఎవరూ పిలవకున్నా వారంతట వారే వచ్చి బాబా సిద్ధాంతాన్ని పాటించారు. డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని ప్రశాంతత పుట్టపర్తిలో అందుకున్నారు. ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్. శతజయంతితో పాటు ఈ రోజు మరో విశిష్టత ఉంది. ఈ ప్రశాంతి నిలయం నిర్మించి నేటికి 75 ఏళ్లు. ఆధ్యాత్మిక సంబరాలకు ఈ నిలయం వేదికైంది. భక్తుల బాధలకు, కష్టాలకు పరిష్కారం చూపే నిలయంగా మారింది. మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా.. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరించారు" అని సీఎం చంద్రబాబు తెలిపారు.

" విద్య నుంచి వైద్యం వరకూ, తాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకూ అందరికీ దక్కేలా చేశారు. దేశ విదేశాల్లో ట్రస్టు ద్వారా సేవలందించారు. 102 సత్యాసాయి పాఠశాలల్లో 60 వేలమంది విద్యార్థులు చదవుకుంటున్నారు.. వారికి ఉచిత విద్య అందిస్తున్నారు. ట్రస్ట్ ఆస్పత్రుల ద్వారా 3 వేల మందికి ప్రతిరోజూ వైద్య సేవలు అందిస్తున్నారు. దాహార్తిని తీర్చడానికి రూ.550 కోట్లతో ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 16 వందల గ్రామాల్లో 30 లక్షల మందికి పైగా నీరు అందిస్తున్నారు. చెన్నై డ్రికింగ్ మోడరేజేషన్‌ కు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యసాయి ట్రస్ట్ 140 దేశాలు, 2 వేల కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషన్ ఆర్గనేజేషన్ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సేవలను ముందుకు తీసుకెళ్తోంది" సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Naidu Joins President Murmu in Revering Sai Baba s Legacy at Puttaparthi Centenary Festivities

"చాలా గర్వపడుతున్నా.. సత్యసాయికి ఈ రోజు 7.50 లక్షల మంది సేవా సభ్యులు ఉన్నారు. ఆయన సేవలను వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నా. సత్యసాయి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బాబా ఇక్కడికి రప్పించారు. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. వసుధైక కుటుంబం భారతీయులకు మూలం. సత్యసాయి బోధనల ద్వారా దాన్ని నిలబెట్టుకుందాం." అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+