ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన బాబు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించే మెట్రో రైలు ప్రాజెక్టును ఢిల్లీ మెట్రో స్థాయిలో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఒకరోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరుపతికి బయలుదేరే ముందు శనివారం ఢిల్లీ మెట్రో రైలులో చంద్రబాబునాయుడు విమానాశ్రయానికి ప్రయాణం చేశారు.
ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు మెట్రో రైలు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. కొత్త రాజధానిలో రవాణా వ్యవస్థను మెరుగుపర్చే ప్రక్రియలో భాగంగా మెట్రో, బుల్లెట్ రైళ్లను ప్రారంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ రూపురేఖలను మార్చటంతోపాటు ప్రజలకు అత్యంత సుఖవంతమైన ప్రయాణ సదుపాయాన్ని కల్పించటంలో మెట్రో విజయం సాధించిందని ప్రశంసించారు. విజయవాడ, విశాఖలో మెట్రో నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించే మెట్రో రైలు ప్రాజెక్టును ఢిల్లీ మెట్రో స్థాయిలో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

చంద్రబాబు
ఒకరోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరుపతికి బయలుదేరే ముందు శనివారం ఢిల్లీ మెట్రో రైలులో చంద్రబాబునాయుడు విమానాశ్రయానికి ప్రయాణం చేశారు.

చంద్రబాబు
ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు మెట్రో రైలు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

చంద్రబాబు
కొత్త రాజధానిలో రవాణా వ్యవస్థను మెరుగుపర్చే ప్రక్రియలో భాగంగా మెట్రో, బుల్లెట్ రైళ్లను ప్రారంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు
ఢిల్లీ రూపురేఖలను మార్చటంతోపాటు ప్రజలకు అత్యంత సుఖవంతమైన ప్రయాణ సదుపాయాన్ని కల్పించటంలో మెట్రో విజయం సాధించిందని ప్రశంసించారు.

చంద్రబాబు
విజయవాడ, విశాఖలో మెట్రో నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications