గంజాయి మాఫియాపై నల్గొండ పోలీసులకున్న సమాచారం ఏపీకి లేదా? జగన్ కు నక్కా ఆనంద్ బాబు సూటి ప్రశ్న

టిడిపి నాయకుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లు తెలంగాణ పోలీసులపై సినీఫక్కీలో దాడికి పాల్పడిన ఘటనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా దిగజారిందని, గంజాయి మాఫియా రెచ్చిపోతున్నదని, ఇంతా జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు.

అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ ను గంజాయి అడ్డాగా మార్చిన జగన్ రెడ్డి
అక్రమార్జన, దోపిడీ కోసం రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల ముఖ్య కేంద్రంగా మార్చారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ ను గంజాయి అడ్డాగా మార్చిన జగన్ రెడ్డి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఏజెన్సీలో తెలంగాణ పోలీసులు వచ్చి దాడి చేసే వరకూ ఏపీ ప్రభుత్వ ఏం చేస్తుంది అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులకు ఉన్న గంజాయి స్మగ్లర్ల సమాచారం ఏపీ పోలీసులకు లేదా అంటూ నిలదీశారు. గంజాయి సాగుకు, అక్రమ రవాణాకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండబట్టే ఏపీ పోలీస్ శాఖ ఏమీ చేయలేక పోతుందని, చేష్టలుడిగి చూస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 Nakka Anand Babu direct question to Jagan on ganja mafia attack on nalgonda police

అధికార పార్టీ నేతల అండదండలతోనే గంజాయి స్మగ్లింగ్
హెరాయిన్ దిగుమతులపై విజయవాడలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు జరిపే వరకు ఏపీ పోలీసులు పట్టించుకోలేదని టిడిపి నేత నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే రాష్ట్రంలో గంజాయి ఇతర మాదకద్రవ్యాల సాగు జరుగుతోందని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. ప్రభుత్వమే కావాలని యువతను మత్తుకు బానిసలుగా చేస్తోందని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులు మూగబోయేలా, యువతను పెడదారి పట్టిస్తుంది అంటూ, మాదక ద్రవ్యాలకు బానిసల్లా చేస్తుందంటూ నక్క ఆనంద్ బాబు ధ్వజమెత్తారు.

కేంద్ర నిఘా సంస్థలు తక్షణం ఏపీపై దృష్టి సారించాలి
చిత్తూరు జిల్లాలో మంత్రి అనుచరులే ఓపిఎంలో వినియోగించే ముడిపదార్థాలను సాగు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగాలు, కేంద్ర నిఘా సంస్థలు తక్షణమే ఏపీపై దృష్టి సారించాలని నక్కా ఆనంద్ బాబు హితవు పలికారు. గంజాయి,మాదకద్రవ్యాల ముడిపదార్థాల సాగు వంటి అసాంఘిక కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్న వారి ఆట కట్టించాలని, ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.

విశాఖ ఏజెన్సీలో తెలంగాణా పోలీసులపై గొడ్డళ్ళతో దాడి చేసిన గంజాయి స్మగ్లర్లు
ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యవహారంలో దృష్టిసారించిన నల్లగొండ పోలీసులు, గంజాయి కేసులో నిందితుల కోసం ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని కొయ్యూరు మండలం తురబాలగడ్డ వద్ద గాలింపు చేపట్టారు. తెలంగాణా రాష్ట్రం నుండి ప్రత్యేక బృందం మూడు రోజులుగా విశాఖ ఏజెన్సీలో గంజాయి ముఠా కోసం జల్లెడ పడుతున్న నేపథ్యంలో గంజాయి స్మగ్లర్ల ముఠా సినీ ఫక్కీలో తెలంగాణ పోలీసు బృందంపై దాడికి ప్రయత్నించింది. గంజాయి స్మగ్లర్ల గ్యాంగ్ ఉన్నట్టు పసిగట్టిన పోలీసులు వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చెయ్యగా ఒక్కసారిగా గొడ్డళ్ళు, రాళ్లతో దాడికి తెగబడ్డారు గంజాయి స్మగ్లర్లు. దీంతో పోలీసులు కాల్పులు జరుపగా ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీ లంబసింగిలో గంజాయి స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+