ఎన్‌కౌంటర్: వారిద్దరు సిమి కార్యకర్తలేనా, గత చరిత్ర ఇదేనా? (ఫొటోలు)

నల్లగొండ: నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన అస్లాం, జకీర్ ఇద్దరు కూడా దోపిడీ దొంగలేనని, వారు ఉగ్రవాద సంస్థలకు చెందినవారు కారని తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి చెబుతున్నారు. కానీ, వారిద్దరు కూడా సిమి ఉగ్రవాదులని అంటూ మీడియాలో పుంఖానుపుంఖంగా వార్తలు వస్తున్నాయి. వారి గత కార్యకలాపాలను కూడా వివరిస్తున్నాయి.

వారిద్దరిపై మహారాష్ట్రలో కూడా పలు కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. సిమీకి చెందిన ఉగ్రవాది అబూ ఫైజల్ ముఠాలో వీరిద్దరు కీలక సభ్యులని అంటున్నారు. గతంలో మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి వీరిద్దరు పరారైనట్లు చెబుతున్నారు. వారిని ఉగ్రవాదులుగా ఇంకా గుర్తించలేదని సంఘటనా స్థలాన్ని సందర్శించిన తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ చెప్పారు. విచారణ కొనసాగుతోందని అన్నారు.

ఎన్‌కౌంటర్ మృతులు వీరేనా...

ఎన్‌కౌంటర్ మృతులు వీరేనా...

సిమీ ఉగ్రవాదులుగా చెబుతున్న వీరిలో అస్లాం, జకీర్ కూడా ఉన్నారు. నల్లగొండ జిల్లా ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరు జకీర్, అస్లాం వారేనా అనేది తేలాలి ఉంది.

ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం ఇదే..

ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం ఇదే..

శనివారం ఉదయం నల్లగొండ జిల్లా జానకీపురం గ్రామం వద్ద దుండగులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన స్థలం ఇదే.

మలుపు చూసి కాల్పులు..

మలుపు చూసి కాల్పులు..

దుండగులను వెంటాడే సమయంలో కానిస్టేబుల్ నాగరాజు వాహనం నడుపుతుండగా, సిఐ బాలగంగిరెడ్డి పక్కన కూర్చున్నాడు. దుండగుల కాల్పుల్లో నాగరాజు మరణించాడు.

ఇద్దరు హతం

ఇద్దరు హతం

పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. వారిని అస్లాం, జకీర్‌లుగా గుర్తించారు.

సమాచారంతో పోలీసులు గాలింపు

సమాచారంతో పోలీసులు గాలింపు

దర్గా వద్ద దుండగులు ఉన్నారనే సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆక్టోపస్, గ్రైహౌండ్స్ కూడా..

ఆక్టోపస్, గ్రైహౌండ్స్ కూడా..

ఆపరేషన్‌లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు కూడా పాల్గొన్నాయి.

సంఘటనా స్థలంలో ఇలా..

సంఘటనా స్థలంలో ఇలా..

ఎదురు కాల్పుల సంఘటనలో పోలీసులు, స్థానికులు ఇలా కనిపించారు.

డిజిపి అనురాగ్ శర్మ

డిజిపి అనురాగ్ శర్మ

ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతాన్ని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ పరిశీలించారు.

మీడియాతో అనురాగ్ శర్మ

మీడియాతో అనురాగ్ శర్మ

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డిజిపి అనురాగ్ శర్మ మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట కాల్పులకు పాల్పడినవారే ఎదురుకాల్పుల్లో మరణించారని చెప్పారు.

తీవ్ర సంచలనం...

తీవ్ర సంచలనం...

ప్రశాంతంగా ఉండే నల్లగొండ జిల్లాలోని జానకీపురం గ్రామ పరిసరాలు తుపాకుల మోతతో దద్ధరిల్లాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

వివరాల సేకరణ...

వివరాల సేకరణ...

సంఘటనా స్థలంలో ఆధారాల కోసం పోలీసులు గాలించారు. వారికి పలు సాక్ష్యాలతో పాటు ఢిల్లీ నుంచి హైదరాబాదుకు తీసుకున్న రైలు టికెట్ కూడా దొరికింది.

గాంధీకి శవాల తరలింపు

గాంధీకి శవాల తరలింపు

ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరు దుండగుల శవాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.

బైక్ ఇదేనా...

బైక్ ఇదేనా...

దుండగులు పారిపోవడానికి ఎత్తుకెళ్లిన డస్కవరీ బైక్ ఇదేనని భావిస్తున్నారు.

వారిద్దరు కూడా ముంబై యాంటీ టెర్రరిస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 2007లో కేరళలో ఉగ్రవాద సాయుధ నిర్వహించిన ముఠాలో ఉన్నారని చెబుతున్నారు. ఖాండ్వా పోలీసు స్టేషన్‌లో 2009, 2010ల్లో కేసులు నమోదైనట్లు సమాచారం. 2010లో భోపాల్‌లోని ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో చోరీకి పాల్పడినట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు బాంబు పేలుళ్ల సంఘటనల్లో వారి పాత్ర ఉన్నట్లు చెబుతున్నారు. 2013లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీలో బాంబులు పేల్చింది కూడా వీరేనని సమాచారం. 2014 అక్టోబర్‌లో కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్‌బిఐలో చోరీకి పాల్పడింది కూడా ఈ ముఠా సభ్యులేనని అనుమానిస్తున్నారు.

కాగా, వారిద్దరికి ఏపీలోనూ, చెన్నైలోని బాంబు పేలుళ్ళ కేసులోనూ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.మృతి చెందిన ఉగ్రవాదులు 3 నెలలపాటు తడ ఏరియాలో సంచరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

నెల్లూరు జిల్లా శ్రీహరికోట సమీపలోని షార్‌ కేంద్రం వద్ద వీరు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు వీరి కోసం తమిళనాడు పోలీసులు కూడా తడలో గాలించారని తెలుస్తోంది. తమిళనాడులో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని అనుమానించిన పోలీసులు ఉగ్రవాదుల ఫొటోలతో తడలోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ తిరిగారని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

వారిద్దరు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని నల్లగొండ జిల్లా భువనగిరి డిఎస్పీ తెలిపారు. దుండగులు షార్ప్ షూటర్లని, గతంలో వారికి నేరచరిత్ర ఉందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+