నామా ఆస్తులు 338కోట్లు, సిపిఐ నారాయణవి కోటిన్నర

నామా కుటుంబ ఆస్తుల వివరాలు.. నామా పేరు మీద ఉన్న ఆస్తులు చరాస్తులు: 141 కోట్లు, స్థిరాస్తులు: 45.5 కోట్లు, చేతిలో నగదు: 69.5 లక్షలు, బ్యాంకులో: 32.6 లక్షలు భార్య చిన్నమ్మ పేరుమీద.. చరాస్తులు: 76 కోట్లు, స్థిరాస్తులు: 67.7 కోట్లు, చేతిలో నగదు: 44.4 లక్షలు, పెద్ద కుమారుడు పృథ్వీతేజ పేరు మీద.. చరాస్తులు: 3 కోట్లు చిన్న కుమారుడు భవ్యతేజ పేరుమీద..
చరాస్తులు: 2.85 కోట్లు, మొత్తం ఆస్తులు: 338 కోట్లకు పైగా ఉన్నాయి.
నారాయణ ఆస్తుల విలువ కోటిన్నరగా అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలు.. చరాస్తులు: 25 లక్షలు, స్థిరాస్తులు: 1.44 కోట్లు, మొత్తం ఆస్తుల విలువ: 1,69,10,510 రూపాయలు కాగా రూ. 1లక్ష అప్పు ఉందని నారాయణ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు, బిజెపి లోకసభ అభ్యర్థి నరేంద్రనాథ్ తన ఆస్తుల విలువ రూ.21.30కోట్లుగా పేర్కొన్నారు. రూ.8.82 కోట్ల అప్పులున్నట్లు తెలిపారు. మెదక్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ కుమార్ రెడ్డి ఆస్తుల విలువ రూ.8 కోట్లగా ఎన్నికల ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.3 కోట్లుగాను, స్థిరాస్తుల విలువ రూ.5 కోట్లు.












Click it and Unblock the Notifications