బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఎన్‌బీకే 108 వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ప్రకటించింది. జూన్ 10వ తేదీన హీరో బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) అనే టైటిల్‌ను ఖాయం చేశారు.
బాలయ్య గతంలో ఎప్పుడూ పోషించని పాత్రను ఇందులో పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి శైలిలో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ ఏమాత్రం మిస్‌కాకుండా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. కాజల్ (Kajal Aggarwal) కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల (sreeleela) కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌పెద్ది నిర్మిస్తున్నారు. 'భగవంత్ కేసరి'ని దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.

సినిమా టైటిల్ ను గతంలో ఎవరూ ప్రకటించని రీతిలో కొత్తగా చేశారు. బాలయ్య 108వ చిత్రం కావడంతో ఏకంగా 108 హోర్డింగ్స్ పై టైటిల్ ను రివీల్ చేశారు. ముందునుంచి వార్తల్లో వచ్చినట్లుగానే భగవంత్ కేసరి టైటిల్ నే ఖరారు చేశారు. దీనికి 'ఐ డోంట్ కేర్'... అనే ట్యాగ్ లైన్ ఉంది. ఈ సందర్భంగా.. అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ అంటూ.. విడుదల చేసిన బాలకృష్ణ లుక్ అదిరిపోయింది. అల్యూమినియం ఫ్యాక్టరీ బ్యాక్ డ్రాప్‌లో పవర్ ఫుల్‌గా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్న బాలయ్యను చూడగానే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. పవర్ ఫుల్ కాప్ గా బాలయ్య కనిపించబోతున్నట్లు మూడు సింహాల ఎంబ్లంతో హింట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications