అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు బామ్మర్ది 'రాజకీయం' బాగా నేర్చాడే?

|
Google Oneindia TeluguNews

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగానే కాకుండా ప్రజాప్రతినిధిగా కూడా రాణిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపుం నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. అంతేకాకుండా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా మూడురకాల పాత్రలను నిజ జీవితంలో పోషిస్తున్న బాలయ్య 'ఆహా' కోసం వ్యాఖ్యాతగా మారిన సంగతి తెలిసిందే.

 రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పించిన బాలయ్య

రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పించిన బాలయ్య

ప్రస్తుత తరం యువతకు చేరువయ్యేందుకు అన్ స్టాపబుల్ బాగా ఉపయోగపడింది. అంతేకాకుండా తన ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ లో రాజకీయాన్ని మిక్స్ చేశారు. తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబుతో, ఆయన తనయుడు లోకేష్ తో కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిద్వారా బాలయ్య ప్రధానంగా రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబును ఎప్పటి నుంచో వేధిస్తోన్న 1995లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంద్వారా ఎన్టీఆర్ కు సొంత అల్లుడే వెన్ను పోటు పొడిచారంటూ ఇతర పార్టీలన్నీ ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రస్తావన తెచ్చి వాటికి చంద్రబాబు నుంచి సమాధానం చెప్పించిన తీరు చూసి సీనియర్ రాజకీయవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. బాలయ్యకు రాజకీయం బాగా ఒంటబట్టిందే అంటూ వ్యాఖ్యానించారు.

నియోజకవర్గంపై అల్లుడిచేతే చెప్పించారు!

నియోజకవర్గంపై అల్లుడిచేతే చెప్పించారు!


అంతేకాకుండా తన అల్లుడు లోకేష్ పై ఫొటోలు చూపించి విమర్శలు చేస్తున్నవారికి అన్ స్టాపబుల్ ద్వారా సమాధానం చెప్పించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచే తాను మరోసారి బరిలోకి దిగుతున్నానని, వేరే నియోజకవర్గ ప్రస్తావనే లేదని లోకేష్ చేతే చెప్పించారు. అదే క్రమంలో వైసీపీ అభిమానులను టీడీపీవైపు తిప్పేందుకు వైఎస్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వారంరోజుల వరకు అది ట్రెండింగ్ లో నడించింది.

వీరసింహారెడ్డి టైటిల్ ఎంపిక

వీరసింహారెడ్డి టైటిల్ ఎంపిక


తాజాగా తాను కథానాయకుడిగా నటిస్తున్న ఎన్ బీకే 107 చిత్రానికి వీరసింహారెడ్డి అనే టైటిల్ ను ఖరారు చేశారు. గత చిత్రాలకు కూడా పేరు చివర రెడ్డి అనే ట్యాగ్ ఉన్నప్పటికీ ఇప్పుడు పెట్టిన కోణంలో రాజకీయం ఇమిడివుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఏపీలో రెడ్డి ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇలా రాజకీయాలకు దూరంగా ఉండే బాలకృష్ణ ఎమ్మెల్యే అయిన తర్వాత, అన్ స్టాపబుల్ చేసిన తర్వాత రాజకీయం బాగానే ఒంటబట్టిందని వ్యాఖ్యలు చేస్తున్నారు.

English summary
He commented that Balayya was very fond of politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X