మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు సర్వే: చంద్రబాబు, బాలయ్య ర్యాంకులు ఇవే..!
అమరావతి: ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు ప్రభుత్వం సొంతంగా సర్వే చేయించిన సంగతి తెలిసిందే. హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణకు అనంతపురం జిల్లాలో నెంబర్ వన్ ర్యాంకు లభించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్రంలో 9వ ర్యాంకు లభించింది.
ఇక జిల్లాల వారీగా చూస్తే అనంతపురం జిల్లాలో పరిటాల సునీతకు 3వ ర్యాంకు, పల్లె రఘునాధ రెడ్డికి 12వ ర్యాంకు లభించాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, వీరికి వరుసగా 22, 140 ర్యాంకులు లభించాయి. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావుకు 6వ ర్యాంకు, రావెల కిశోర్ బాబుకు 10వ ర్యాంకు లభించగా, వీరిద్దరికీ రాష్ట్రంలో వరుసగా 63, 100 ర్యాంకులు వచ్చాయి.

కృష్ణా జిల్లాలో, దేవినేని ఉమ, కొల్లు రవీంద్రలు 3వ ర్యాంకులో నిలిచారు. వీరికి రాష్ట్రంలో వరుసగా 30, 70 ర్యాంకులు లభించాయి. పశ్చిమ గోదావరిలో పైడికొండల మాణిక్యాలరావుకు 8, పీతల సుజాతకు 13 ర్యాంకులు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడికి 5వ ర్యాంకు, నిమ్మకాయల చినరాజప్పకు 10వ ర్యాంకు, కర్నూలులో కేఈ కృష్ణమూర్తికి 2వ ర్యాంకు, విశాఖలో అయ్యన్న పాత్రుడికి 3వ ర్యాంకు, గంటాకు 14వ ర్యాంకు వచ్చాయి.
విజయనగరం జిల్లాలో కిమిడి మృణాళినికి 8వ ర్యాంకు, శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడికి 2వ ర్యాంకు లభించాయి. ఎమ్మెల్యే కాకపోవడంతో సర్వేలో మంత్రి నారాయణ పేరును పరిగణనలోకి తీసుకోలేదు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో చివరి నాలుగు ర్యాంకులు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు లభించాయి.












Click it and Unblock the Notifications