ఆ ఒక్కటితో ప్రారంభం కాబోతున్న బాలయ్య చిత్రం

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు. దాదాపుగా ఇది పూర్తికావస్తోంది. విజయ దశమి సందర్భంగా దీన్ని విడుదల చేయబోతున్నారు. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే బాలయ్య తన 109వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేయబోతున్నారు.

అధికారికంగా ఈ సినిమాను ఇటీవలేప్రకటించారు. బాబీ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఒక పవర్ ఫుల్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే యోచనలో బాబీ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తీయబోతున్నట్లు తెలుస్తోంది.

nandamuri balakrishna

ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం పూర్తి సెట్ ను రెడీ చేస్తున్నారు. ఇది రెండువారాల్లో పూర్తికానుంది. అనంతరం షూట్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రీ కొడుకులుగా బాలయ్య నటించబోతున్నారని ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. డ్యూయల్ రోల్ పాత్రలు బాలకృష్ణ ఎన్నో చేశారు. మరి ఈసారి బాలయ్యను బాబీ ఎటువంటి పాత్రల్లో చూపిస్తాడో? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమాకు థమన్ స్వరాలందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+