ముఖ్యమంత్రి పదవిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన అసెంబ్లీ నియోజకవర్గమైన హిందూపురంలో ప్రజా సమస్యలు తీర్చడంపై దృష్టిని సారించినట్లు తెలిపారు.

అమరావతి: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన అసెంబ్లీ నియోజకవర్గమైన హిందూపురంలో ప్రజా సమస్యలు తీర్చడంపై దృష్టిని సారించినట్లు తెలిపారు.

సీఎం పదవిపై ఆశలేదు..

సీఎం పదవిపై ఆశలేదు..

తనకు సీఎం కావాలనో, మంత్రి కావాలనో ఎటువంటి ఆశలూ లేవని స్పష్టం చేశారు. పెద్ద పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, తన తండ్రి పోటీ చేసి గెలిచిన హిందూపురాన్ని మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని స్పష్టం చేశారు.

ప్రజల ప్రతినిధే..

ప్రజల ప్రతినిధే..

ఇక్కడున్న సమస్యల్లో కొన్ని తన దృష్టికి వచ్చాయని, ఇక్కడి ప్రజల ప్రతినిధిగా వాటిని పరిష్కరించడమే తన ముందున్న తొలి కర్తవ్యమని బాలకృష్ణ అన్నారు. ఆపై తెలుగుదేశం పార్టీకి అవసరమైన సేవలను అందిస్తానే తప్ప ముఖ్యమంత్రి పదవి పొందాలని ఎన్నడూ అనుకోనని బాలకృష్ణ వివరించారు.

నేతల తీరుపై ఆగ్రహం..

నేతల తీరుపై ఆగ్రహం..

ఇది ఇలా ఉండగా, రెండ్రోజుల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలోనే పార్టీ నేతలు తీవ్రంగా గొడవ పెట్టుకోవడంతో బాలయ్య నేతల తీరుపై సీరియస్ అయ్యారు. కలిసి పనిచేస్తే చేయాలని ఆయన కోరారు. లేకపోతే వెళ్ళిపోవాలని ఆయన హెచ్చరించారు.

తీవ్ర హెచ్చరిక

తీవ్ర హెచ్చరిక

‘నియోజకవర్గం ప్రజలను అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల చెంతకు చేర్చాలన్నది నా తపన. అందుకు మీరు కలిసి వస్తే ఉండండి ... లేదంటే వెళ్లిపోండి' అంటూ టీడీపీ చిలమత్తూరు మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా హెచ్చరించారు. పద్దతి మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+