ఎంపీ విజయసాయిరెడ్డికి నందమూరి బాలకృష్ణ ఫోన్..!!
నందమూరి బాలకృష్ణ కు వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి ఫోన్ చేసారు. తారకరత్నకు అందించాల్సిన వైద్యం గురించి చర్చించారు.
సినీ హీరో..టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి ఫోన్ చేసారు. తాజాగా నందమూరి తారకరత్నను బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తారకరత్నను సాయిరెడ్డి పరామర్శించారు. వైద్యులను ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. గుండె బాగానే ఉందని.. మెదడులో సమస్యలు ఉన్నాయని..కోలుకుంటారని వైద్యులు విజయ సాయిరెడ్డికి వివరించారు. దీంతో, విజయ సాయిరెడ్డి త్వరలోనే తారకరత్న ఆరోగ్యంతో బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.
తారకరత్న గుండోపోటుకు గురైన సమయం నుంచి నందమూరి బాలకృష్ణ దగ్గర ఉండి అన్ని వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసారని చెప్పిన సాయిరెడ్డి..ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. దీంతో..ఇప్పుడు బాలకృష్ణ నేరుగా సాయిరెడ్డికి ఫోన్ చేసారు. నారాయణ హృదయాలయ హాస్పిటల్ అందుతున్న చికిత్స గురించి వివరించారు. కుప్పంలో తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైన సమయంలో 45 నిమిషాలు పాటు క్లిష్ట పరిస్థితిలో ఉన్నారని బాలయ్య వివరించారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు.

తారకత్న సతీమణి అలేఖ్యా రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు. సాయిరెడ్డి సతీమణి సోదరి కుమార్తె అలేఖ్య రెడ్డి. తాజాగా తారకరత్నను పరామర్శించిన సమయంలో సాయిరెడ్డి ఆయన కుటుంబ సభ్యలకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం తారకరత్న క్రమేణా కోలుకుంటున్నారని బంధువులు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, పురంధేశ్వరి, బ్రాహ్మణి సహా నందమూరి కుటుంబ సభ్యులు ఆస్పత్రి లో తారకరత్నను పరామర్శించారు. కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభానికి హాజరైన తారకరత్న అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో స్థానిక ఆస్పత్రి..ఆ తరువాత బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించారు. సాయిరెడ్డికి ఫోన్ చేసిన నందమూరి బాలకృష్ణ రానున్న రోజుల్లో తారకరత్నకు అందించాల్సిన వైద్యం గురించి చర్చించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications