నందమూరి బాలకృష్ణ, వసుంధర ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ప్రముఖ సినీనటుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించిన బాలకృష్ణ.. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు.

హిందూపురంతోపాటు రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు బాలయ్య. కాగా, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతోపాటు కలిసి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు బాలకృష్ణ. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.

nandamuri balakrishna revealed his assets and liabilities in his election affidavit

బాలకృష్ణ తన నామినేషన్ పత్రాల్లో ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తనకు రూ. 9 కోట్లకుపైగా అప్పులున్నాయని బాలయ్య తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బాలయ్య చూపిన ఆస్తుల విషయానికొస్తే.. ఆయన ఆస్తుల విలువ రూ. 81.63 కోట్లు. ఆయన సతీమణి వసుంధర ఆస్తుల విలువ రూ. 140 కోట్ల 38 లక్షల 83 వేలు. బాలయ్య అప్పులు 9 కోట్ల 9 లక్షల 22 వేల రూపాయలుగా పేర్కొన్నారు. వసుంధర అప్పులు రూ. 3 కోట్ల 83 లక్షల 98 వేలుగా ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు.

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. తాగునీటి సమస్య తీర్చడంతోపాటు మండలాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టులను నిర్మించినట్లు తెలిపారు. అన్నక్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించినా.. హిందూపురంలో 400 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నందమూరి కుటుంబంపై హిందూపురం ప్రజలకు ఎనలేని అభిమానమని అన్నారు. తనను రెండుసార్లు గెలిపించిన హిందూపురం ప్రజలను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని బాలకృష్ణ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+