బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రోమోకు రికార్డుస్థాయిలో వ్యూస్
నందమూరి బాలకృష్ణ జీవితాన్ని రెండుగా విభజిస్తే అన్ స్టాపబుల్ కు ముందు బాలకృష్ణ, అన్ స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంతో బాలకృష్ణ ఇమేజ్ రెండింతలు పెరగడమేకాదు.. ఆహాకు కూడా బాగా కలిసివచ్చింది. రెండోసీజన్ లో అదిరిపోయే రీతిలో అతిథులను ఆహ్వానిస్తున్న బాలయ్య ఈసారి రెబల్ స్టార్ ప్రభాస్, ఆయన సన్నిహితుడు, హీరో గోపీచంద్ ను ఆహ్వానించారు.
ప్రభాస్ ను, గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. తాజాగా విడుదలైన ప్రోమోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ రేర్ కాంబినేషన్ ను ఆడియన్స్ ను ఉత్తేజపరుస్తుందనే నమ్మకంతో ఆహా యాజమాన్యం ఉంది. చాన్నాళ్ల తర్వాత వింటేజ్ ఎనర్జీ తో ఉన్న ప్రభాస్ ని చూసి అభిమానులు ఆనందపడుతున్నారు. ప్రోమో మాత్రం కేజ్రీగా మారింది. సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య, ప్రభాస్ అభిమానులు ఈ ప్రోమోను చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమోకు 12 గంటల్లో ఏకంగా 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

మధ్యలో ప్రభాస్ రామ్ చరణ్ కు కాల్ చేయడం అందరినీ ఎగ్జైట్ చేసింది. ఈనెల 30వ తేదీన ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రభాస్ ఎపిసోడ్ త్వరగా చూడాలని అభిమానులు, నెటిజన్లు జోరుగా కామెంట్లు పెడుతున్నారు. 30వ తేదీన కార్యక్రమం ప్రసారం కానుండటంతో 29వ తేదీ వరకు ఈ ప్రోమోకు ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని ఆహా అంచనా వేస్తోంది. కార్యక్రమం స్ట్రీమింగ్ అయిన తర్వాత ఎంతమంది దీన్ని వీక్షిస్తారనేది అంచనాకు కూడా అందడంలేదని, ప్రోమోనే అంచనా వేయలేకపోయామని చెబుతోంది. ఏదేమైనప్పటికీ డార్లింగ్ ప్రభాస్, అతన్ని సన్నిహితుడు గోపీచంద్ తో బాలయ్య చేసిన రచ్చ చూడటానికి ఇంకా 11 రోజులే ఉంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications