విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్‌తో నందమూరి కుటుంబ సభ్యులు భేటీ.. ఎన్టీఆర్ భారీ విగ్ర‌హం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు మహనీయుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం నందమూరి కుటుంబం, ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రజాభిష్టం ఈ నాటికి నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మకూరులోని నందమూరి కుటుంబీకులు ఎంతగానో సంబరపడుతున్నారు. విశ్వసనీయతకు, విలువలకు సీఎం జగన్ మారుపేరంటూ కొనియాడుతున్నారు.

జ‌గ‌న్‌తో నంద‌మూరి కుటుంబం

జ‌గ‌న్‌తో నంద‌మూరి కుటుంబం

.
మహనీయుడు నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరుకు చెందిన ఎన్టీఆర్ బంధువులు, మిత్రులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. విజయవాడ జిల్లాలకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా తమ జిల్లాలకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిమ్మకూరు గ్రామస్తులు కోరారు. అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరు పెడతామంటూ పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు.

 నిమ్మ‌కూరు స‌మ‌స్య‌లు సీఎం దృష్టి

నిమ్మ‌కూరు స‌మ‌స్య‌లు సీఎం దృష్టి

నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునందుకు సీఎం జగన్‌ను నందమూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, నిమ్మకూరు గ్రామస్తులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిమ్మకూరు గ్రామంలో ఉన్న‌ సమస్యలను ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామంలో కోటి రూపాయల విలువైన పైపులైను దెబ్బతిన్నాయని.. మంచినీటికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. వాటికి నిధులు కేటాయించాలని కోరారు. దీంతో వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిమ్మకూరులో ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఖర్చుకు వెనుకాడకుండా వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు.

 .ఎన్టీఆర్ భారీ విగ్ర‌హం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్

.ఎన్టీఆర్ భారీ విగ్ర‌హం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్


నిమ్మకూరు గ్రామంలో ఉన్న 14 ఎకరాల చెరువులో ఎన్టీఆర్ విగ్రహాం ఏర్పాటు చేయాలని నందమూరి కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్తులు సీఎం జగన్‌ను కోరారు. దీనికి ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందించార‌రు. ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజు నాటికి ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నిమ్మ‌కూరు వాసుల‌కు హామీ ఇచ్చారు.. వచ్చే నెల 28న శంకుస్థాపన చేసిన వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సం చేస్తామని తెలిపారు. ఈ మేరకు విగ్రహం ఏర్పాటుపై ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు జగన్ ఆదేశించారు .

English summary
Nanadamuri family meets with cm jagan mohan reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X