టీడీపీకి ఊహించని బిగ్ షాక్ ఇచ్చిన నందమూరి కల్యాణ్ రామ్
Nandamuri Kalyan Ram: నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం.. డెవిల్. పీరియాడికల్ థ్రిల్లర్. అతని సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తోంది. సత్య, మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్.. ఇతర కీలక పాత్రలను పోషించారు. అభిషేక్ నామా దర్శకుడు. ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
అభిషేక్ నామా, దేవాన్ష్ నామా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చారు. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కల్యాణ్ రామ్ నటించాడిందులో. ఓ డార్క్ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి కిందటే లాంచ్ అయింది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిందీ మూవీ. అమిగోస్ డిజాస్టర్ తరువాత కల్యాణ్ రామ్ నుంచి వస్తోన్న సినిమా ఇదే. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, కొన్ని ట్విస్టులు.. సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. బ్రిటీష్ ఏజెంట్‌గా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు కల్యాణ్ రామ్.
ఇటీవలే విడుదల అయిన డెవిల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా గతంలో ఎప్పుడూ చేయని పాత్రను పోషిస్తోన్నారాయన. ప్రస్తుతం డెవిల్ ప్రమోషన్స్‌లో విస్తృతంగా పాల్గొంటోన్నారు కల్యాణ్ రామ్. వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలను ఇస్తోన్నారు.
ఈ సందర్భంగా ఓ వెబ్‌సైట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి మాట్లాడారు. ఏపీలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు కల్యాణ్ రామ్ బదులిచ్చారు. రాజకీయాలకు సంబంధించిన అంశం కావడం వల్ల సమాధానం ఇవ్వడానికి కొద్దిసేపు తటపటాయించారు.

ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది తన ఒక్కడి నిర్ణయం మీద ఆధారపడి ఉండదని కల్యాణ్ రామ్ అన్నారు. కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. తాను గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. నాన్న లేకపోవడం వల్ల తామే కుటుంబ పెద్దగా ఉంటోన్నామని, తాను, తారక్ ఇద్దరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కల్యాణ్ రామ్ అన్నారు.












Click it and Unblock the Notifications