నందమూరి సుహాసిని కుమారుడి వివాహం: చంద్రబాబు, బాలయ్య హాజరు

హైదరాబాద్: దివంగత సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తనయుడైన వెంకట శ్రీహర్ష వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో కుటుంబసభ్యులతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

 nandamuri suhasini

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ప్రముఖ సినీటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తోపాటు ఆయన కుటుంబసభ్యులు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

 nandamuri suhasini

కాగా, సుహాసిని కుమారుడు వెంకట శ్రీహర్ష ఎంగేజ్‌మెంట్ ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఈ వేడుకకు ఆమె సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్, మరో సోదరుడు, దివంగత జానకిరామ్ భార్య, కుమారుడు, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. బిజీ షెడ్యూల్ కారణంగా మరో సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు.

ఇది ఇలావుండగా, రెండ్రోజుల క్రితం ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్‌ వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఆయన నగరానికి చెందిన డాక్టర్​ ఐశ్వర్యను వివాహమాడారు. శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జరిగిన ఈ వేడుకకు రాజకీయ నాయకులు, టాలీవుడ్ సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్​, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్​ పవన్‌కల్యాణ్‌, మెగా పవర్ స్టార్​ రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు హాజరయ్యారు. సిద్ధార్థ్ నిశ్చితార్థం మే నెలలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+