నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం: గ్రానైట్ రాయికి పూజలు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో జరిగిన నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలు బలిగొన్న గ్రానైట్ రాయికి అపరిచిత వ్యక్తులు పూజలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో మడకశిర లెవెల్ క్రాసింగ్ వద్ద సోమవారం ఓ గ్రానైట్ లారీ అదుపు తప్పి రైలును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. రైల్వే ట్రాక్ పక్కనే పడి ఉన్న 20 టన్నుల గ్రానైట్ రాయికి మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు పసుపు కుంకుమ జల్లి పూజలు నిర్వహించారు. రాయికి కొబ్బరికాయ కొట్టారు.

గ్రానైట్ రాయిని అనుమతి లేకుండా తరలించబోయిన యజమానులే ఈ పూజలు నిర్వహించి ఉంటారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ రాయిని సంబంధిత వ్యక్తులు ఒకటి రెండు రోజుల్లో అక్కడి నుంచి తీసుకువెళ్లనున్నారని, మరోమారు ఏ ప్రమాదం జరుగకుండా మంత్రగాళ్ల సూచన మేరకు పూజలు నిర్వహించారన్న ప్రచారం జరుగుతున్నది.
తక్కువ ప్రాణ నష్టం జరిగినందున రైల్వే అధికారుల సూచన మేరకు కొందరు కాంట్రాక్టర్లు పూజలు నిర్వహించారని మరో వాదన వినిపిస్తున్నది. గ్రానైట్ రాయికి పూజ నిర్వహించడంపై ఇంకా పలు ఆసక్తికరమైన చర్చ ఆ ప్రాంతంలో జరుగుతోంది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications