ఏపీలో టీడీపీ నేత ఇంటికి వెళ్లిన తెలంగాణ పోలీసులు

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లారు. ఓ భూవివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. మొదట నోటీసులివ్వాలని శివానందరెడ్డి పోలీసులను కోరగా, వారు నోటీసులు తయారుచేస్తున్న క్రమంలో శివానందరెడ్డి కారెక్కి వేగంగా వెళ్లిపోయారు. అతన్ని అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. అయితే అతను దొరక్కుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

శివానందరెడ్డి అనుచరులు కూడా అదే సమయంలో పోలీసుల కారు పోనివ్వకుండా గేటు వేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ లోని ఉన్నతాధికారులకు పోలీసులు వివరించారు. హైదరాబాద్ లో ఓ భూవివాదం కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారనే సమాచారం అందడంతో శివానందరెడ్డి ఇంటికి భారీగా పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

nandyal district tdp leaders sivanandareddy absconded with fear of telangana police arrest

హైదరాబాద్ తోపాటు పరిసర ప్రాంతాల్లో భూదందాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మరింత ఎక్కువగా ఆక్రమణలు చోటుచేసుకున్నాయని, వీటివెనక అప్పటి అధికార పార్టీ నాయకులున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.

ఏయే నాయకులు, ఏయే కేసుల్లో ఉన్నారు? ఎవరెవరు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు? బలవంతంగా బెదిరించి భూములు లాగేసుకుంది? ఎవరు అనే కోణంలో ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. ప్రస్తుతం మాజీలు ఉన్న నేతలతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్ల పరిధిలోని మరికొందరు నాయకులున్నట్లు తెలియడంతో కేసును మరింత లోతుగా దర్యాప్త చేస్తున్నారు. ఈ కేసు చివరకు ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్న భయం భారత రాష్ట్ర సమితి నాయకుల్లో నెలకొంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+